
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సఫారీ బ్యాట్స్ మెన్లకు తొలి మ్యాచ్ ఆడుతోన్న రోలాండ్ జోన్స్ చుక్కలు చూపించాడు. తొలి వికెట్ 18 పరుగుల వద్ద నేలకూలగా, 61 పరుగులు చేరుకునే సమయానికి 7 వికెట్లు క్యూ కట్టాయి. ఇందులో టాప్ 4 బ్యాట్స్ మెన్లను పెవిలియన్ పంపిన ఘనత రోలాండ్ జోన్స్ కు దక్కింది. ఈ దెబ్బకు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 126 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఫాలో ఆన్ తప్పించుకోవాలన్నా మరో 27 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే క్రీజులో బావుమా (34) రూపంలో ఓ బ్యాట్స్ మెన్ ఉండడంతో, ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కే అవకాశాలున్నాయి. సిరీస్ సమానంగా నిలవడంతో, ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న ఇంగ్లాండ్ సిరీస్ విజేతను నిలిచే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…