
తొలి టెస్ట్ ను అవలీలగా గెలిచి లీడ్ లో ఉన్న ఆదిత్య జట్టుకు రెండవ టెస్ట్ మ్యాచ్ లో అనూహ్యమైన షాక్ ఇచ్చి సిరీస్ ను 1-1తో సమానం చేసింది విండీస్ జట్టు. లీడ్స్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బెన్ స్టోక్స్ (100), రూట్ (59) బ్యాటింగ్ తో 258 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు బ్రాత్ వైటే (134), హోప్ (147) పరుగులతో రాణించడంతో ఏకంగా 427 పరుగులు సాధించి ఇంగ్లాండ్ పై లీడ్ సాధించింది.
తొలి ఇన్నింగ్స్ లో అంతగా రాణించలేకపోయిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించడంతో 490/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టోన్ మాన్ (52), రూట్ (72), మలన్ (61), స్టోక్స్ (58), అలీ (84), వోక్స్ (61) పరుగులతో అద్భుతంగా రాణించారు. దీంతో 322 పరుగులతో బరిలోకి దిగింది విండీస్ జట్టు. నాలుగవ రోజు ఓవర్ నైట్ స్కోర్ 5 పరుగులతో ముగించిన విండీస్ జట్టు, చివరి రోజున 322 పరుగుల లక్ష్యాన్ని సాధిస్తుందని బహుశా ఆ జట్టు కూడా ఊహించి ఉండకపోవచ్చు.
కానీ క్రికెట్ లో అసాధ్యం కానిది ఏది లేదన్నట్లు… 53 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి డిఫెన్స్ లో ఉన్న విండీస్ జట్టును మళ్ళీ బ్రాత్ వైటే (95), హోప్ (118) పరుగులు చేసి జట్టుకు అనూహ్యమైన విజయాన్ని అందించారు. ఈ విజయం విండీస్ జట్టుకు మాంచి ‘బూస్ట్’ ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు (147, 118) పరుగులు సాధించిన హోప్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండవ ఇన్నింగ్స్ లో చేతిలో వికెట్లు ఉంచుకుని కూడా డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు మాత్రం భారీ షాకే తగిలింది.
దాదాపుగా 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ జట్టుపై ఓ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించడంతో చిరస్మరణీయంగా మారింది. 1970 నుండి 1990 వరకు ఇంగ్లాండ్ పై ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓడిపోని విండీస్ జట్టు, 2001 నుండి 2016 వరకు ఇంగ్లాండ్ పై ఒక్క టెస్ట్ మ్యాచ్ లోనూ విజయం సాధించలేకపోయింది. అంతకుముందు టీ 20 మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ పై విజయానికి కారణమైన ఓపెనర్ కారోల్ బ్రాత్ వైట్ ఈ మ్యాచ్ లోనూ (134, 95) పరుగులతో రాణించి ఇంగ్లాండ్ ఓటమికి కారణమయ్యాడు.
Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…
Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…