
Aditya Hasan’s EPIC movie arrives with paid premieres after a mixed response to its trailer
‘90’s’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ‘EPIC’ నేడు పెయిడ్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
గత రాత్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
‘EPIC’ ప్రకటించినప్పుడు సినిమాపై మంచి హైప్ వచ్చింది. ఆదిత్య హాసన్ కొత్త పేరే అయినా, ‘90’s’ లాంటి గుర్తుండిపోయే సిరీస్ అందించాడు. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌కు కూడా రచయితగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు.
కానీ ‘EPIC’ ట్రైలర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రైలర్‌కు ఆశించిన స్పందన రాలేదు. ఈ విషయాన్ని ఆదిత్య హాసన్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై అంగీకరించాడు.
తన కెరీర్‌లో మొదటిసారి ఇలాంటి నెగెటివిటీ ఎదుర్కొన్నానని చెప్పాడు. అయినా ఆదిత్య హాసన్ సినిమా అనే నమ్మకంతో కొందరు ‘EPIC’కు ఒక ఛాన్స్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నాడు.
ఈ సినిమా ఆదిత్య హాసన్‌కు చాలా కీలకం. అతను ఒక్క సినిమాతో మాయమయ్యే దర్శకుడిలా కనిపించడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి ‘EPIC’ను నిలబెడితే, అతని పేరు మీద నమ్మకం మరింత పెరుగుతుంది.
ఒకవేళ సినిమా మెప్పించకపోతే అతని కెరీర్ ముగిసినట్టు కాదు. కానీ కెరీర్ ప్రారంభంలోనే అది పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ట్రైలర్‌కు వచ్చిన స్పందనను మార్చాల్సింది ‘EPIC’ సినిమానే. ఆదిత్య హాసన్ ఆ నమ్మకాన్ని నిలబెడతాడేమో చూడాలి.
Sowmika is turning the ocean into her personal runway with a breathtaking new beach photoshoot…
Mamitha Baiju and Nivin Pauly’s Bethlehem Kudumba Unit has become a sensational success in Kerala…