
Weddings And Divorces Both Come At Cost!
ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం. కానీ నేడు అది ఒక ఆడంబర వేడుకగా మారిపోయింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ తమ స్థాయికి మించి వివాహ వేడుకలను అత్యంత ఖరీదుగా జరుపుకుంటున్నారు.
సెలబ్రిటీలు ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ల పేరుతో కోట్లు ఖర్చు చేస్తుంటే, సామాన్యులు సైతం ఐదు రోజుల వేడుకలంటూ వివాహ వ్యయాన్ని అమాంతం పెంచేస్తున్నారు. పసుపు కొట్టే తంతు (హల్దీ) నుంచి మొదలై మెహందీ, సంగీత్, వివాహం, రిసెప్షన్, వ్రతం… ఇలా ఏ వేడుక చూసుకున్నా బడ్జెట్ బారులు తీరుతోంది.
“జీవితంలో ఒక్కసారే వచ్చే వేడుక కదా, ఆ మాత్రం ఖర్చు సహజం” అనే ధోరణితో ఆహ్వాన పత్రికల నుంచి విందు భోజనాల వరకు, ప్రీ-వెడ్డింగ్ నుంచి పోస్ట్-వెడ్డింగ్ ఫోటోషూట్ల వరకు అన్నింటినీ అత్యంత ఖరీదుగా ప్లాన్ చేసుకుంటున్నారు.
పెళ్లి వేడుక కోసం కుటుంబాలు చేసే ఆడంబరపు ఖర్చు అందరి కంటికి కనిపిస్తుంది. కానీ, ఇంత భారీ వ్యయంతో చేసుకున్న పెళ్లిళ్లు ఆ జంటలను ఎంతకాలం కలిపి ఉంచగలుగుతున్నాయి అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని జంటల విషయంలో కనీసం ‘ఇద్దరు ముగ్గురు’ అయ్యేవరకు కూడా ఆ బంధం నిలబడటం లేదు.
మరోవైపు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు సమాజంలో గొప్పల కోసమో, మధుర జ్ఞాపకాల కోసమో తమ స్తోమతకు మించి అప్పులు (లోన్లు) చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నాయి. అయితే, మారుతున్న జీవనశైలి, అపార్థాల కారణంగా నేటి యువతలో చాలామంది పెళ్లి కోసం చేసిన ఆ అప్పులు తీరకముందే విడాకుల బాట పడుతున్నారు.
పెళ్లి ఖర్చు అందరికీ కనిపిస్తుంది, అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. కానీ, నేటి సమాజంలో ‘విడాకులు’ కూడా అంతకంటే ఖరీదైనవిగా మారాయన్నది చేదు నిజం. ఇక్కడ ఖర్చు అంటే కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, అంతకుమించిన మానసిక వ్యథ కూడా!
విడాకుల ప్రక్రియలో భాగంగా చెల్లించాల్సిన భారీ భరణాలు (Alimony), కోర్టు ఖర్చుల నుంచి మొదలుపెడితే.. ఆ తర్వాత ఎదురయ్యే ఒంటరితనం వరకు నేటి యువత పెద్ద మూల్యమే చెల్లిస్తోంది. పెళ్లి వేడుకలో అండగా నిలిచిన బంధువులు, స్నేహితులు విడాకుల సమయంలో కనిపించరు.
ఈ మానసిక వేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఒక్కోసారి సొంత కుటుంబ సభ్యుల నుంచే సానుభూతి కరువై యువత లోలోపలే కుమిలిపోతున్నారు, దాని ఫలితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితాలను బలి చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమి కాదు. నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 'యాత్ర' నుంచి నేటి నారా లోకేష్ 'యువగళం'…
The trailer for Yeh Prem Mol Liya arrived on November 18, 2026. Directed by Sooraj…