
Jagan's early padayatra plan for 2027 AP
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమి కాదు. నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘యాత్ర’ నుంచి నేటి నారా లోకేష్ ‘యువగళం’ వరకు ఏపీ రాజకీయాల్లో నేతల పాదయాత్రలు కీలక మలుపులు కారణాలుగా నిలిచాయి.
అయితే 2019 నాటి వైఎస్ జగన్ ‘ప్రజాసంకల్ప యాత్ర’ వైసీపీ ని అధికారం పీఠం ఎక్కించింది, జగన్ ను ముఖ్యమంత్రిని చేసింది. అలాగే 2024 ఘోర ఓటమి తరువాత వైసీపీ ని రాజకీయంగా తిరిగి నిలబెట్టేందుకు జగన్ 2029 ఎన్నికల కోసం మరోమారు పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించేసారు.
తొలుత 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఈ యాత్ర ప్రారంభం అవుతుందని సంకేతాలు ఇచ్చినప్పటికీ, మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ తన పాదయాత్ర షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేసినట్టు వైసీపీ అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం మేరకు జగన్ తన పాదయాత్రను కొన్ని నెలల ముందుకు అంటే 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
అయితే జగన్ ముందస్తు పాదయాత్ర కూటమిని రాజకీయంగా వెనక్కి నెట్టగలదా? వైసీపీ పూర్వపు రాజకీయ వైభవాన్ని తిరిగి సాధించగలుగుతుందా? జగన్ 2.0 ఆశలను నిజం చెయ్యగలుగుతుందా? జగన్ ముందస్తు పాదయాత్ర వైసీపీకి రాజకీయ లబ్ది చేకూర్చగలుగుతుందా? ఇలా జగన్ పాదయాత్ర చుట్టూ అనేక ప్రశ్నలు జవాబు కోసం వేచిచూస్తున్నాయి.
అయితే వైసీపీ భావిస్తున్నట్టు జగన్ ముందస్తు పాదయాత్రతో ప్రజల ముందుకొస్తే వైసీపీకి రాజకీయ లబ్ది చేకూర్చే అంశాలతో పాటుగా ఆ పార్టీని రాజకీయంగా ఇరకాటంలో పడేసే అవకాశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని అంశాలు…
కార్యకర్తల్లో నూతనోత్సాహం, ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసిపట్టుకోవడం, క్షేత్ర స్థాయి పరిస్థితుల అవగాహన, సమస్య పరిష్కారాల కోసం తగిన సమయం, సొంత పార్టీ నేతల వాస్తవిక పరిస్థితుల పై పూర్తి స్ఫష్టత, ఎన్నికల ప్రణాళికల కోసం పటిష్టమైన సమయం…ఇలా జగన్ ముందస్తు పాదయాత్ర వైసీపీ పార్టీకి కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నపటికీ మరికొన్ని అంశాల్లో అంతకు మించి నష్టాన్ని చేకూర్చగలదు.
ముందుగా నాటి వైసీపీ ప్రభుత్వ లోపాలు, రాజకీయ విధానాలు, వ్యక్తిగత దూషణలు, పాలనాపరమైన దోషాలు, రాజధాని పై వైసీపీ వైఖరి, అధికారం కోసం పాదయాత్రలు – అధికారం వచ్చాక పరదాల యాత్రలా? అనే సూటి ప్రశ్నలు..ఇలా జగన్ ముందస్తు పాదయాత్ర నాటి 2019 నాటి పాదయాత్ర మాదిరి సాఫీగా సాగే అవకాశం లేకపోవచ్చు అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.
ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం. కానీ నేడు అది ఒక ఆడంబర వేడుకగా…
The trailer for Yeh Prem Mol Liya arrived on November 18, 2026. Directed by Sooraj…