Telugu

అమెజాన్ పేరుతో కూర్చున్న కొమ్మనే నరుకుంటున్న నిర్మాతలు

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ సినిమా, ఎఫ్2. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు గా నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 78 కోట్లు సంపాదించి టాలీవుడ్ అల్ టైమ్ టాప్ ఎనిమిదవ సినిమాగా నిలించింది. 80 కోట్ల క్లబ్ వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. పండగ తరువాత విడుదలైన ఏకైక పెద్ద సినిమా, మిస్టర్ మజ్ను ప్లాప్ కావడంతో ఈ సినిమా ఇంకా విజయవంతంగా సాగుతుంది. నాలుగవ వారంలో కూడా వసూళ్లు రాబడుతుంది.

ADVERTISEMENT

అయితే ఈ నెల 11న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ ఎకౌంటు తో పాటు పైరసీ వెబ్ సైట్లలో కూడా ఆ రోజు వచ్చేస్తాది. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు, ట్రేడ్ కు ఇది షాక్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన సినిమాలు ఏమి విడుదలకు లేకపోవడంతో ఇంకొద్ది కాలం సినిమా ఆడాల్సి ఉంది. కాకపోతే విడుదలకు ముందే పెద్ద మొత్తానికి ఈ సినిమా హక్కులను అమ్మేశాడు దిల్ రాజు.

అగ్రిమెంట్ ప్రకారం సినిమా విడుదలైన 30 రోజుల తరువాత ఎప్పుడైనా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసే హక్కు ఆ సంస్థకు ఉంది. వారు పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి వెంటనే విడుదల చేసేస్తోంది అమెజాన్ ప్రైమ్. అయితే సినిమా విడుదలైన నెల రోజులకే ఇలా నెట్ లో వచ్చేస్తే ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటు తగ్గించేస్తారు. ఏడాదికి 1000 రూపాయిలు పెట్టి అమెజాన్ అకౌంట్ కొనుకుంటే ఫ్రీగా బోలెడు సినిమాలు. ఇంకొంచెం ఓప్పిగ్గా వెయిట్ చేస్తే పైరసీ సైట్లలో ఫ్రీ. కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటున్నారు మన నిర్మాతలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Keerthy Suresh Reveals an Uncomfortable Truth

Keerthy Suresh has made strong comments about some male actors she has worked with, revealing…

5 minutes ago

Rs 3 Crore Film Reportedly Beats KGF Chapter 1

A small-budget Kannada film is making headlines with claims that it has overtaken Yash’s KGF:…

1 hour ago