
మరి సురేష్ బాబు ఈ ఉదంతంపై ఇప్పటివరకు స్పందించారా? అంటే దానికి సమాధానం తెలిసిందే. ఇప్పటివరకు సురేష్ బాబు తరపున గానీ, నేరుగా సురేష్ బాబు గానీ పెదవి విప్పలేదు. ఎవరికీ వినిపించని సురేష్ బాబు మాటలు, ఒక్క యూ ట్యూబ్ వీడియో వర్గాలకు మాత్రం వినిపించాయి. “శ్రీరెడ్డిపై సురేష్ బాబు ఫస్ట్ రెస్పాన్స్” అంటూ టైటిల్ పెట్టి ఏకంగా వీడియోలు సృష్టించి యూ ట్యూబ్ లోకి వదులుతున్నారు.
వాడకం ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ యూ ట్యూబ్ వీడియోలనే చూడాలి అన్నట్లుగా ఈ హంగామా జరుగుతోంది. ఓ పక్కన తమ అవకాశాలు అంటూ శ్రీరెడ్డి పోరాడుతుండగా, మరో పక్కన ఏం చెప్పాలో పాలుపోని స్థితిలో సురేష్ బాబు వర్గం ఉందని చెప్పవచ్చు. ‘ఎవడి గోల వాడిది’ అన్నట్లుగా యూ ట్యూబ్ వీడియోల వంతవుతోంది. ఈ ఫేక్ టైటిల్స్ తో క్లిక్స్ కోసం ఎంత తప్పుడు వార్తలు రాస్తున్నారో అనడానికి ఇది మరొక నిదర్శనం.
ఇంతేనా… సురేష్ బాబు ఏంటి… వెంకటేష్ కూడా శ్రీరెడ్డి లీక్స్ పై కామెంట్స్ చేసారంటూ యూ ట్యూబ్ లో ఉండే వీడియోలకు కొదవేలేదు. ఇంత దారుణంగా యూ ట్యూబ్ లో పెడుతున్నారు కాబట్టే, సినీ జనాలు కూడా గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ ఫేక్ టైటిల్స్ వీక్షకులను ఆకర్షించి క్లిక్స్ రావడం వలన, ఈ వీడియోల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోవడం విశేషం. వీటిని అంతం ఎప్పుడో ఆ దేవుడికే ఎరుక!
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…