
ఈ అమ్మకాల ద్వారా ఏకంగా లక్ష రూపాయల లాభాన్ని కూడా ఆర్జించాడు. వాట్సాప్ ద్వారా తన యాడ్స్ ను చూసిన వారు తనను సంప్రదిస్తుంటారని రాకేశ్ తెలిపాడు. ఇటీవల అశోక్, బాబు అనే ఇద్దరు వ్యక్తులు రాకేశ్ యాడ్ ను చూసి అతడిని కలిశారు. రాకేశ్ ఆలోచన తమకు స్ఫూర్తి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఓఎల్ఎక్స్ లో పశువుల ఫొటోలు చూసి నచ్చితే విక్రయదారులను కలిసి బేరం కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు.
టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటున్న రాకేశ్ కత్రి మరెందరికో ఆదర్శంగా నిలిచాడు. ఇదిలా ఉంటే మరో ‘ఈ-కామర్స్’ సైట్ ‘క్వికర్’లో ఇటీవల ఆవు పిడకలకు సంబంధించిన ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయి. ‘స్వచ్ఛమైన ఆవుపేడతో తయారు చేసిన పిడకల కోసం సంప్రదించండి’ అంటూ వస్తున్న యాడ్లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…