
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపులో భాగంగా శ్రీనగర్‌లో 10 మంది ఉగ్రవాదుల ఇళ్ళని గుర్తించి భద్రతా దళాలు కూల్చివేశాయి. శ్రీనగర్ అంతటా గాలించి మిగిలినవారి ఇళ్ళు కూడా కూల్చివేస్తామని ఆర్మీ అధికారులు చెపుతున్నారు. ఈ వార్త దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
కూల్చివేసే ముందు వారి ఇళ్ళలో నుంచి భారీగా ఏకే 47 తుపాకులు, తూటాలు, కంప్యూటర్లు, కొన్ని డిజిటల్ పరికరాలు, కొన్ని సమాచార పత్రాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, జనావాసాల మద్య ఉగ్రవాదులు అంత విలాసవంతమైన ఇళ్ళు ఎలా నిర్మించుకోగలిగారు?వాటిలోకి తుపాకులు, బాంబులు వగైరా ఎలా తీసుకురాగలిగారు? అయినా నిఘా వర్గాలు, భద్రతా దళాలు ఎందుకు గుర్తించలేకపోయాయి?
ఇంకా విషాదకరమైన విషయం ఏమిటంటే, భద్రతా దళాలు వారి ఇళ్ళను గుర్తించి లోనికి ప్రవేశించి సోదాలు చేయబోతుంటే, వాటిలో పేలిపోయేందుకు సిద్దంగా ఉన్న బాంబులను గుర్తించి వెంటనే బయటకు పరిగెత్తి భద్రతా దళాలు తృటిలో తమ ప్రాణాలు కాపాడుకున్నాయి! కనుక మిగిలిన ఉగ్రవాదుల ఇళ్ళలోకి ప్రవేశించకుండానే కూల్చివేశారు. బాంబులు పెట్టి పేలిపోయేలా చేసిన ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకు పారిపోయారు.
సరిహద్దు అవతల నుంచి వచ్చే ఉగ్రవాదులను అడ్డుకోవడం కోసం భద్రతా దళాలు రేయింబవళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి మరీ గస్తీ కాస్తుంటారు. కానీ లష్కరే తోయిబా వంటి కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే విలాసవంతమైన ఇళ్ళు నిర్మించుకొని దర్జాగా ఉంటున్నారంటే అది నిఘా, భద్రతా వైఫల్యం కాదా?
స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసులు, స్థానిక రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలకు తెలియకుండానే వారు అక్కడ ఇళ్ళు నిర్మించుకొని నివశిస్తున్నారా?అనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరు ఇస్తారు?
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…