మీరు మొదలుపెట్టారు…మేము ముగిస్తాం..!

జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీ నాయకుల ఇళ్ల మీద, టీడీపీ కార్యకర్తల మీద జరిగిన దాడులు లెక్కించాల్సి వస్తే చిత్రగుప్తుడు చిట్టా పొద్దు వలే చాంతాడంత ఉంటుంది. టీడీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద అప్పటి అధికార పార్టీ నాయకుడు జోగి రమేష్ దాడికి యత్నించారు.

ADVERTISEMENT

తన అధినేతను మెప్పించి మంత్రి పదవి దక్కించుకోవాలి అనే దురుద్దేశంతో అప్పటి ప్రతిపక్ష నేత బాబు ఉండవల్లి నివాసంపై ఒక మంది వైసీపీ కార్యకర్తలను వెంటేసుకుని కర్రలు చేతపట్టుకుని దాడికి వచ్చారు జోగి రమేష్. జోగి రమేష్ సాహసానికి మెచ్చిన జగన్ ఆయనకు అనుకున్నట్టే మంత్రి పదవిని కట్టబెట్టారు.

అలాగే బాబు ప్రయాణిస్తున్న బస్సు మీద కూడా రాళ్ళూ వేసి ఇది ప్రజాస్వామ్య హక్కు అంటూ పైశాచిక ఆనందం పొందారు వైసీపీ నాయకులు. ఇలా గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ దాడులు, హింస అనే రెండు విష విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా బలంగా నాటారు.

ఆ విత్తనం పెరిగి పెద్దవుతూ మహా వృక్షంలా వెళ్ళురుముకుని రాజకీయాలను భ్రష్టు పట్టిస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి. వైసీపీ పెంచి పోషించిన విష సంస్కృతిని మార్చాల్సి ఉంది. తానూ నాటిన విష వృక్షం సమాజానికి ఎంత ప్రమాదమో జగన్ కు ప్రతిపక్షంలోకి వస్తే తప్ప అర్ధం కాలేదు.

ఇప్పుడు రెడ్ బుక్ పెట్టుకుని టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు అంటూ కూనిరాగాలు తీస్తున్న జగన్ గతంలో ఏ బుక్ అడ్దు పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నాయకులను జైళ్లకు పంపారో, పవన్ మీద కేసులు పెట్టారో, బాబు ని అరెస్టు చేసారో, లోకేష్ ను అరెస్టు చేయాలనీ చూసారో సమాధానం చెప్పగలరా.? ఏపీ రాజకీయాలలో రాజకీయ వేధింపులు అనే విష సంస్కృతిని నాటింది జగన్.

ఆ దాడులు, హింస, రాజకీయ వేధింపులు అనే మహా వృక్షాలను కూకటి వేళ్ళతో పెకిలించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై పడింది. దానిలో భాగంగా గతంలో అద్దు దాటి, చట్టాన్ని మీరి ప్రవర్తించిన ప్రతి ఒక్కరి పై చట్ట పరమైన చర్యలకు సిద్దమయ్యింది కూటమి ప్రభుత్వం. గతంలో ఆధారాలు లేకుండా అరెస్టులు చేసి చట్టం తన పని తానూ చేస్తుంది అంటూ జగన్ సమర్ధించుకున్నారు.

ఇప్పుడు ఆధారాలు, సాక్ష్యాలతో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయినా కక్ష్య సాధింపు అంటూ జగన్ శుద్ద ప్రవచనాలు వల్లే వేస్తున్నారు. ఇందులో భాగంగా జోగి రమేష్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేసారు పోలీస్ అధికారులు. దీనితో ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఇవ్వాలంటూ ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ కోర్ట్ మెట్లెక్కారు జోగి.

జోగి వేసిన పిటిషన్ ను కోర్ట్ ఈ నెల 8 న విచారణ చేపట్టే అవకాశం ఉంది. నిన్న ఈవీఎమ్ లను పగలకొడితే నేరమా.? అంటూ జైలుకెళ్లి పిన్నేల్లికి మద్దతు పలికిన జగన్ రేపు బాబు ఇంటి మీద దాడి చేస్తే తప్పేముంది అంటూ జోగికి వంత పాడతారా.? ఇలా దాడులను ప్రోత్సహిస్తూ, హింసను ప్రేరేపిస్తూ చట్ట వ్యతిరేకంగా జగన్ మొదలు పెట్టిన రాజకీయ క్రీడను చట్టబద్ధంగా మేము ముగిస్తాం అంటున్నారు కూటమి నేతలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pan-India Craze: Telugu Stars Ignoring a Huge Fan Base?

Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…

9 minutes ago

AP Local Polls: YCP Starting With Disaster Slogan?

Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…

39 minutes ago