
ఎన్నికలు అనగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా మానిఫెస్టో రూపంలో పేజీలకు పేజీలు ఉచిత పథకాలను ప్రకటించుకుంటూ పోతున్నాయి. ఒకరు నవరత్నాలు అంటే మరొకరు ఆ రత్నాలకు తోడు సూపర్ సిక్స్ అంటున్నారు. ఒకరు దళిత బందు అంటే మరొకరు బీసీ రిజర్వేషన్ అంటున్నారు.
మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, దాని ఫలితంగా ఆటోవాలాలకు 15 వేల ఆర్థిక సాయం. మహిళలకు నెలకు 2500, ఆడబిడ్డ వివాహానికి 8 గ్రాముల బంగారం, ఉచిత గ్యాస్ సిలిండర్, అమ్మ ఒడి, దీపం పథకం, రైతు భరోసా, వృద్ధాప్యం పిన్షన్, వితంతు పిన్షన్, హాండీ కాఫ్టెడ్ ఫైన్షన్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఉచిత ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు…ఇలా చెప్పుకుంటూ పొతే ఈ ఉచితాలకు అంతే లేకుండా పోయింది.
అయితే ప్రభుత్వాలు తన రాష్ట్ర బడ్జెట్ లో సింహ భాగం ఈ ఉచిత పథకాల అమలుకే కేటాయిస్తుంటే ఇక అభివృధికి నిధులేవీ.? ప్రతి రాష్ట్రం ఇన్ని వేల కోట్ల, లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తుంది.? ఏనాటి నుంచో రాజకీయాలలో ఉండి కొమ్ములు తిరిగిన నేతలు కూడా ఉచితాలనే పట్టుకుని వేలాడుతున్నారు,
ఇక రాజకీయాలలోకి కొత్తగా అడుగుపెడుతున్న యువరక్తం సైతం ఉచితాల వైపే మొగ్గుచూపుతోంది. అయితే ఓట్లు మాత్రం అందరిని అడిగి ఉచితాలు మాత్రం కొందరికే అంటే ఆ ఉచితాల భారం ఈ కొందరికి మోయలేని ఆర్థిక భారం లా మారుతుంది.
ఇలా కాకుండా ప్రభుత్వాలు అన్ని కూడా వృద్దులకు, వికలాంగులకు, రైతులకు వారికి తగ్గ ఆర్థిక సాయం అందించి అందరికి ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెస్తే అది అందరికి లబ్దిని చేకూరుస్తుంది. అలాగే ఇలా వర్గాల వారిగా, లింగ బేధాల వ్యత్యాసం తో పంపే ఉచితాల కంటే ఈ ఉచిత విద్య – ఉచిత వైద్యం ప్రభుత్వాలకు భారమవుతుందా.?
నేడు సోషల్ మీడియాలో ఈ ఉచితాల మీద, వాటిని ప్రకటిస్తున్న రాజకీయ పార్టీల మీద విస్తృత చర్చ జరుగుతుంది. నేటి తరం ఓటర్లు కూడా అందరికి ఉచిత విద్య – ఉచిత వైద్యం సరిపోతుంది కదా అనే వాదనతో ఏకీభవిస్తున్నారు. కానీ మొదటగా పిల్లి మేడలో గంట కట్టే ఆ రాజకీయ నేత కోసమే సమాజం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది.
ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వలాభాన్ని పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం, దేశ ఆర్థిక ప్రగతి కోసం ఒక్కతాటి మీదకు వచ్చి ఈ నినాదాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లగలిగితే భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు.
మరి ఆ తొలి అడుగు వేసే రాష్ట్రం ఏది.? ఆ రాజకీయ పార్టీ ఎక్కడ.? ఆ రాజకీయ నాయకుడు ఎవరు.? అసలు ఇది భారతదేశ రాజకీయంలో సాధ్యమయ్యే పనేనా.? ప్రాంతీయ పార్టీల పెరుగుదలే ఉచిత పథకాల పెంపుకు కారణంగా మారుతుందా.? ఒకరి పై మరొకరు రాజకీయంగా పై చేయి సాధించడానికి ఉచితాలే మార్గాలుగా మారుతున్నాయా.?
Mouli has become a familiar name through his social media work, web series and Little…
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…