
వైసీపీ రాజకీయ ప్రవేశం తో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఊహించని పెను మార్పులు వచ్చాయనే చెప్పాలి. ప్రభుత్వ పాలన నుంచి ప్రతిపక్ష విమర్శ వరకు, నేతల ప్రకటనల నుంచి అధినేతల ప్రచారాల వరకు అన్నింటిలో వైసీపీ మార్పులు తెచ్చింది.
అయితే ఆ మార్పులు రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కాకూండా రాష్ట్ర వినాశనం కోసం రాష్ట్ర ప్రజల తిరోగమనం కోసం ఉండడం బాధాకరం. ఒకప్పుడు ప్రభుత్వాలకు నిర్మాణాలే తెలుసు కానీ వైసీపీ రాకతో కూల్చివేతకు తెలిసాయి.
అలాగే ఒక రాష్ట్ర రాజధాన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చొచ్చు అని రాష్ట్రానికి ఒక రాజధాని కాదు మూడు రాజధానులు ఉండొచ్చు అని కూడా దేశానికి చాటిచెప్పింది ఒకే ఒక్క రాజకీయ పార్టీ కూడా వైసీపీ కావడం దురదృష్టకరం.
వైసీపీ రాజధానుల పేరుతో మొదలుపెట్టిన రాజకీయ చదరంగం ఇప్పటికి మావిగన్ రూపంలో ఏపీని వెంటాడుతూనే ఉంది. అయితే వైసీపీ రాజకీయ విధ్వంసానికి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత కూడా రాష్ట్ర రాజధానిని కాపాడేందుకు చట్ట భద్రతా కోసం పట్టుబట్టారు.
వైసీపీ 2.0 అధికారంలోకి వస్తే అన్న రాజధాని అమరావతి రైతుల ప్రశ్నలకు బాబు దగ్గర ఉన్న ఏకైక సమాధానం అమరావతి కి రాజధానిగా చట్టభద్రత కల్పించడమే. అందుకోసం సీఎం గా బాబు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అమరావతికి చట్టబద్దత కల్పించారంటూ పట్టుబట్టారు.
దీనితో పార్లమెంట్ ఉభయసభలలోను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కి కేంద్ర చట్టబద్దత కల్పిస్తూ ఆమోద ముద్ర వేసింది. ఆ ఒక్క బిల్లు అమరావతి రైతుల అన్ని ప్రశ్నలకు జవాబుగా మరింది, ఏపీ భవిష్యత్ కి భరోసా ఇచ్చింది. అలాగే వైసీపీ రాకతో ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టింది.
అయితే నాడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని గా అమరావతి భద్రత కోసం, వైసీపీ నుండి రాజధానిని కాపాడుకునేందుకు చట్టభద్రత వైపు మొగ్గుచూపారు, దానిని అమరావతి ఒక కవచంలా మార్చారు. ఇక ఇప్పుడు ఈ చట్టభద్రత అనే అంశం మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కి అవసరమొచ్చింది.
తమ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ నుంచి రేవంత్ సర్కార్ మొదలుపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ కి కూడా అమరావతి మాదిరి రక్షణ కరువయ్యింది. అందుకోసం తెలంగాణ ముఖ్యంమత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కి చట్టభద్రత ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ గా మొదలుపెట్టిన ఫ్యూచర్ సిటీ కి బిఆర్ఎస్ 3.0 అధికారంలోకి వస్తే భవిష్యత్ ఉండదంటూ ఆ పార్టీ ముఖ్య నేత హరీష్ రావు ప్రకటించారు. హరీష్ చేసిన ఈ ఒక్క ప్రకటన రేవంత్ ని సంకటంలో పడేసింది. రేపటి రోజున కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాకపోతే నేడు ఫ్యూచర్ సిటీ కోసం రేవంత్ వేస్తున్న పునాదులు సమాధులు కాకతప్పదు అన్న ఆందోళన రేవంత్ ను వెంటాడుతుంది.
అందుకోసం రేవంత్ కూడా బాబు మాదిరి చట్టభద్రత కోసం ఆలోచనలు చేస్తున్నారు. అందుకోసం గత ప్రభుత్వ జీవో లలో చట్టసరణలు చేసి ఫ్యూచర్ సిటీకి చట్ట రక్షణ కల్పించనున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా కొత్త ప్రభుత్వాలు పాత ప్రభుత్వాలు వేసిన పునాదులను తవ్వేస్తే ఇక పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ప్రభుత్వాల పై నమ్మకం ఉంచుతారా.?
ఇలా మీరు అనుమతులిస్తే మేమిచ్చి ఆపేస్తామని, మీరు నిర్మిస్తే మేం కూల్చేస్తామంటూ రాజకీయ పార్టీల అధినేతలు, నేతలే బహిరంగ ప్రకటనలు ఇస్తుంటే ఇక సామాన్యుడికి ప్రభుత్వ మాటల పట్ల విలువుంటుందా.? ఇలా అయితే ప్రభుత్వాలు నిర్మించే ప్రతి నిర్మాణానికి భవిష్యత్ లో చట్ట భద్రత తప్పనిసరి అయ్యే పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…
Madhuri Jain gives traditional saree styling a moody, modern pulse in this striking photoshoot. Draped…