Telugu

గాదె సాయికృష్ణ కేసు సీబీఐకి.. సమంజసమే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది.

ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి నాలుగు వారాల్లోగా ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

సాయికృష్ణ ఎటువంటివాడు?వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హడావుడిగా వెళ్ళి అతని తల్లిని ఎందుకు పరామర్శించారు? అనే విషయాలు పక్కన పెడితే సాయికృష్ణకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే.

భారత్‌పై ఉగ్రదాడులు చేసిన అజ్మల్ కసాబ్ వంటి వారిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ, అతను ఈ నేరానికి పాల్పడ్డాడని సుప్రీంకోర్టు ధ్రువీకరించుకున్న తర్వాత ఉరి తీసేందుకు అనుమతించింది.

కనుక నేరం చేసిన వారినైనా, అన్యాయంగా కేసుల్లో చిక్కుకున్న అమాయకులనైనా, దోషిగా లేదా నిర్దోషిగా నిర్ధారించే హక్కు, వారిని శిక్షించే హక్కు ఎవరికీ ఉండదు.

కనుక అతనిని కస్టడీలో హింసించి చంపినట్లు పేర్కొనబడుతున్న కృష్ణలంక సీఐ నాగరాజుని ప్రభుత్వం ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించింది.

ఈ కేసు విషయంలో ప్రభుత్వంపై వైసీపీ చాలా ఒత్తిడి తెచ్చింది. కనుక ప్రభుత్వానికి నిజాయితీ లేదు వైసీపీకి మాత్రమే ఉందనుకోలేము. అలాగే హైకోర్టు తాజా తీర్పుతో వైసీపీ విజయం సాధించినట్లు కాదు. ప్రభుత్వం ఓడినట్లు కాదు.

ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు హైకోర్టు తీసుకున్న సరైన నిర్ణయంగా మాత్రమే ఈ తీర్పును చూడాలి.

కానీ సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించడం తమ విజయమే అని వైసీపీ వాదించదలచుకుంటే, అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులో కూడా సీబీఐ లేదా ఈడీ విచారణ వేగవంతం చేయడం రాజకీయం కాదని సబబేనని అంగీకరించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 5th T20I: Bowling Woes Bring Swing King Back!

Bhuvneshwar Kumar is back in India's T20I squad after nearly four years, with the experienced…

12 minutes ago

ఈ జేబులో డబ్బు ఆ జేబులో పెట్టుకున్నా మనదేగా?

కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచన చేస్తున్నప్పుడే చిన్న శ్రీనుతో సహా పలువురు టీడీపిలో చేరారు. అదేవిధంగా జనసేనలో…

43 minutes ago