
ప్రస్తుతం దానికే సమాధానం లభించింది. దాదాపుగా 100 కోట్ల రూపాయల బ్లాక్ మనీని 20 శాతం కమీషన్ తో వైట్ గా మార్చారని ఖరారు కావడంతో… మరో కేసు గాలి మెడకు చుట్టుకోబోతోందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. నిజానికి ఈ వివాహ వేడుక జరిగిన వెంటనే ఐటీ శాఖ అధికారులు గాలి జనార్దన్‌కు చెందిన ఆఫీసులపై దాడులు జరిపారు. అలాగే గాలికి నోటీసులు కూడా ఇచ్చి, విచారణకు హాజరయ్యేలా చేసారు. అయితే తాజాగా గాలి డ్రైవర్ ఆత్మహత్య ఉదంతంతో మొత్తం వెలుగులోకి వచ్చింది.
ఓ రెవిన్యూ అధికారి సహాయంతో దాదాపుగా 100 కోట్ల రూపాయలను 20 శాతం కమీషన్ తో మార్చారని, అయితే ఆ లెక్కల్లో తక్కువ వచ్చిందని తేలడంతో, అందులో తానూ భాగస్వామి అయినందున తన చంపేస్తామని గాలి అనుచరులు బెదిరిస్తున్నారని… ఓ లేఖ రాస్తూ ఆత్యహత్య చేసుకోవడంతో ఈ మొత్తం స్కాంకు సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బలమైన సాక్ష్యాలు లభించడంతో తన కూతురి పెళ్లి గాలి మెడకు చుట్టుకుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ‘బళ్ళారి బాబు’ గారు ప్రపంచంలో చేయనిదంటూ ఏమీ లేదా… అని నోరెళ్ళపెట్టడం ప్రజల వంతవుతోంది.
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…