Telugu

గేమ్ ఛేంజర్‌… నిజమే!

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా గేమ్ ఛేంజర్‌ సినిమాని మూడేళ్ళుగా తీస్తూనే ఉన్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతోందని చెప్పుకుంటారు కానీ నేటికీ షూటింగ్‌ ఇంకా పూర్తవలేదు!

గేమ్ ఛేంజర్‌ని డిసెంబర్‌ 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాత దిల్‌రాజు చెప్పేశారు. తాము ఎంతో కష్టపడి భారీ బడ్జెట్‌తో తీస్తున్న గేమ్ ఛేంజర్‌ సినిమాని సంక్రాంతి పండుగకు విడుదల చేస్తే బాగుంటుందని అందరూ భావించడంతో జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించిన్నట్లు దిల్‌రాజు తెలిపారు.

ADVERTISEMENT

గేమ్ ఛేంజర్‌ కోసం జనవరి 10న విడుదల కావలసిన ‘విశ్వంభర’ సినిమాని వాయిదా వేసుకునేందుకు చిరంజీవి, యూవీ క్రియేషన్స్ అంగీకరించినందుకు దిల్‌రాజు ధన్యవాదాలు తెలుపుకున్నారు.

శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ 2021లో మొదలుపెట్టగా, మల్లాది వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా విశ్వంభర 2023, అక్టోబర్‌లో మొదలుపెట్టి ఏడాదిలోగా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసేశారు. జనవరి 10న విడుదల చేసేందుకు సిద్దమయ్యారు కూడా. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్‌ వలన విడుదలకి సిద్దంగా ఉన్న విశ్వంభర విడుదల వాయిదా వేసుకోవలసి వస్తోంది.

శంకర్ పెద్ద హీరోలతో, భారీ బడ్జెట్‌తో భారీ సినిమాలు తీసే పెద్ద దర్శకుడు. కనుక ఆయన సినిమాలు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారని సరిపెట్టుకోవచ్చు.

కానీ అంత భారీ బడ్జెట్‌, అంత పెద్ద హీరోలని పెట్టుకొని అన్నేళ్ళపాటు సినిమా తీసినా సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందా?అంటే అనుమానమే. కమల్ హాసన్‌తో చేసిన భారతీయుడు-2 ఇందుకు తాజా ఉదాహరణగా కనిపిస్తోంది.

అందువల్లే రామ్ చరణ్‌ అభిమానులు గేమ్ ఛేంజర్‌ గురించి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా జనవరికి వాయిదా పడటంతో వారికి మరికొంత ఆందోళన, కొంత ఊరట కూడా కలుగుతాయి.

ఈరోజు విశ్వంభర టీజర్‌ విడుదలైంది. కానీ దానిలో సినిమా రిలీజ్ డేట్ వెల్లడించలేదు. బహుశః మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కనుక ఈ రెండు పెద్ద సినిమాల రిలీజ్‌లో జరిగిన ఈ మార్పులు సంక్రాంతి బరిలో ఉన్న ఇతర సినిమాలపై ప్రభావం చూపడం తధ్యం. కనుక వాటి పాలిట ఇది నిజంగానే ‘గేమ్ ఛేంజర్‌’ అవుతుందేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈ స్థానిక పరీక్షలు వైసీపీకి కాదు.. కూటమికే!

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీలు అవలీలగా మెజార్టీ స్థానాలు దక్కించుకుంటాయి. కనుక ఏపీలో కూటమి పార్టీలు కూడా…

26 minutes ago

Shocking From CEO: Mass Layoffs In Indian IT?

The Indian IT sector is already witnessing a period of turbulence with several companies starting…

29 minutes ago