Telugu

గన్నవరంలో కూటమికి ఎదురుదెబ్బలు.. కారణం ఏమిటి?

టీడీపి, వైసీపీ రెండు పార్టీలకు కృష్ణా జిల్లాపై మంచి పట్టుంది. ముఖ్యంగా టీడీపికి ఈ జిల్లా కంచుకోట వంటిది. కానీ గన్నవరం శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ: 14 పంచాయతీలు, టీడీపి: 10, టీడీపి: రెబెల్స్: 2, జనసేన:1 దక్కించుకున్నాయి. ఈ ఫలితాలను చూస్తే గన్నవరం టీడీపిలో అసలు ఏం జరుగుతోందనే సందేహం కలుగక మానదు.

గన్నవరం జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన బిజేపికి చెందిన కుమారస్వామి 63 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పుడే తొలి ప్రమాద హెచ్చరిక జారీ అయినట్లు గ్రహించి ఉంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇంతకంటే చాలా మెరుగుగా ఉండేవి.

ADVERTISEMENT

ఈ సందర్భంగా టీడీపి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, “కుమారస్వామి ఓడిపోవడం నాకూ పెద్ద షాకే. నేనూ చాలా బాధపడ్డాను. గన్నవరం ప్రజలు ఎప్పుడూ ట్రెండ్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తుంటారు. ఇప్పుడూ అలాగే జరిగిందని భావిస్తున్నాను,” అని అన్నారు.

ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే బాపులపాడు మండలంలో 27 పంచాయతీలకు వైసీపీ 14 గెలుచుకోవడం, టీడీపి కేవలం 10 స్థానాలకే పరిమితమవడం గమనార్హం.

ముఖ్యంగా చిరివాడ, రేమల్లెలో టీడీపి నుంచి ఇద్దరు,బాపులపాడులో టీడీపిని కాదని జనసేన రెబెల్ అభ్యర్ధి పోటీ చేసి గెలవడం గమనిస్తే, నియోజకవర్గంలో టీడీపి నేతలకు, ఆయనకు మధ్య అవగాహనాలోపం నెలకొందని స్పష్టమవుతోంది.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరు టీడీపి రెబెల్స్, జనసేన అభ్యర్ధిని కలుపుకున్నా కూడా కూటమి పార్టీలు వైసీపీ కంటే ఒక స్థానం తక్కువే ఉంది.

అదే… రెబెల్స్‌ని కలుపుకోకుండా చూస్తే బాపులపాడు మండలంలో కూటమికి కేవలం 10 పంచాయతీలు మాత్రమే దక్కినట్లవుతుంది.

ఇదే సమయంలో గన్నవరంలో వైసీపీ శ్రేణులన్నీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశానుసారం కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాయి.

ఇవి పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలే అయినప్పటికీ, కృష్ణాజిల్లాలో అదీ… టీడీపికి మంచి పట్టున్న గన్నవరం నియోజకవర్గంలో టీడీపికి ఇది ప్రమాద హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Balakrishna-Koratala Combo Gets a Musical Twist

Balakrishna and Koratala Siva are coming together for a new film, and there seems to…

5 minutes ago

Hail Mary: Malayalam Thriller Breaks All Expectations?

The Malayalam film Hail Mary starring Kunchacko Boban and Vinay Forrt in the lead roles…

36 minutes ago