Telugu

హమ్మయ్యా! గంటా టెన్షన్ ఫినిష్…

ఏపీ ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని ఓటు వేయనిస్తారా లేదా? అనే సస్పెన్స్ వీడింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన శాసనసభ కమిటీ హాల్ నంబర్:1లో పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు.

రెండేళ్ళ క్రితం ఆయన స్టీల్ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, తన రాజీనామాను ఆమోదించవలసిందిగా స్పీకర్‌కు లేఖలు కూడా వ్రాశారు. కానీ వెంటనే ఆమోదించకుండా పక్కన పెట్టేయడం వలన ఇప్పుడు టిడిపి లాభపడింది.

ADVERTISEMENT

ఆయన ఓటు వేయకుండా అడ్డుకొనేందుకు హడావుడిగా రాజీనామా లేఖను ఆమోదించాలని వైసీపీ భావించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడి, ఓట్లర్ల (ఎమ్మెల్యేలు) జాబితా కూడా ప్రకటించిన తర్వాత రాజీనామాను ఆమోదించినా సాంకేతికంగా చెల్లదని గ్రహించిన వైసీపీ గంటాను అడ్డుకోలేకపోయింది. కనుక ఆయన తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. తమ అలసత్వం వలన టిడిపికి మేలు కలగడం వైసీపీ జీర్ణించుకోవడం కష్టమే.

ఇటీవల వైసీపీని వీడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. తాను ఆత్మ ప్రబోధం ప్రకారమే ఓటు వేశానని చెప్పారు. ఈ ఎన్నికలలో వైసీపీ, టిడిపిలు మాత్రమే పోటీ పడుతున్నాయి. ఆయన వైసీపీని వీడారు కనుక టిడిపికే ఓటు వేసిన్నట్లు భావించవచ్చు.

టిడిపి 19 ఓట్లు ఎలాగూ టిడిపికే పడతాయి. అయితే టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలవాలంటే, అధికార వైసీపీకి చెందిన ఒక్కరైనా ఆమెకు ఓటు వేయాలి లేదా ఒక్క వైసీపీ ఓటు అయినా చెల్లకుండాపోవాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేటికీ సాంకేతికంగా వైసీపీ ఎమ్మెల్యేగా పరిగణింపబడుతున్నారు. ఆయన టిడిపికి ఓటు వేసి ఉంటారు. వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లతో పాటు మరో 4-5 వైసీపీ ఓట్లు టిడిపికి పడవచ్చని భావిస్తోంది. ఈ ఎన్నికలలో టిడిపి గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది.సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Day 1 BO: How Did VD’s Ranabaali Start?

Vijay Deverakonda is back on the big screen with Ranabaali. The film is based on…

13 minutes ago

Aakasamlo Oka Tara Teaser Highlights an Emotional Journey

Aakasamlo Oka Tara, presented by Geetha Arts and Swapna Cinema, explores the story of Kalpana,…

56 minutes ago