
అవసరమైతే తప్ప ఎప్పుడూ మాట్లాడని గంటా శ్రీనివాసరావు ఈమధ్య తరచూ వార్తల్లో ఉంటున్నారు. గత కొన్ని రోజుల వరకు సైలెంట్ గా ఉన్న గంటా ప్రస్తుతం తన విమర్శలతో వైసీపీ ని ఓ రేంజ్ లో వాయిస్తున్నారని సొంత పార్టీ టీడీపీ శ్రేణులే అంటున్నాయి.
తాజాగా గంటా శ్రీనివాసరావు మరోసారి తన విమర్శలతో హాట్ టాపిక్ గా నిలిచారు. నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ప్రతిఒక్కరి జీవితం సమస్యల వలయంగానే మారిందని గంటా విమర్శించారు. ఏపీలో సమస్య లేని వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
గతంలో వైసిపి ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ స్పందన కార్యక్రమానికి కాళ్ళు అరిగేలా తిరిగినా ప్రయోజనం మాత్రం శూన్యం అని గంటా ఘాటు విమర్శలు చేశారు. సాయం కోసం ఎదురుచూస్తున్న పేద రైతులు, జీతాల కోసం పడిగాపులు పడుతున్న ఉద్యోగులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు, పింఛన్ కోసం ఎదురుచూపులు, ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని గంటా అన్నారు.
గంటా ఈ స్థాయిలో విమర్శించడానికి కారణం ఈరోజు జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన “జగనన్నకు చెబుదాం” అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలు చెప్పాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పడం వింతగా ఉందని గంటా అన్నారు.
ఎన్ని టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినా ప్రజా సమస్యలతో టెలిఫోన్ బాక్సులు జామ్ అవ్వాల్సిందే తప్ప , ప్రజా సమస్యలకు మాత్రం పరిష్కారం దొరికే పరిస్థితి లేదు అని గంటా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలన్ని ట్విట్టర్ వేదికగా చేశారు గంటా.
గంటా మాటలన్నీ వాస్తవాలే కదా.. మొత్తానికి ఈమధ్య వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శలతో గంటా వాయించేస్తున్నారని వీక్షకులు అనుకుంటున్నారు.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…