
కనీసం 50 థియేటర్లను ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకుని, వాటిల్లో చిన్న చిత్రాలను ప్రదర్శించే వీలును కల్పించాలని డిమాండ్ చేస్తూ… సినీ రచయిత, దర్శకుడు రాజేష్ సాయి చేపట్టిన దీక్ష నేటికి మూడవ రోజుకు చేరుకుంది. వంద కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న సినిమాల్లానే కోటి రూపాయలతో తీసే సినిమాలు కూడా లోకేషన్లకు అద్దెలను చెల్లిస్తున్నాయని, పబ్లిసిటీ నిమిత్తం ఖర్చు పెడుతున్నాయని, అయితే థియేటర్లు లభించని ఘోర పరిస్థితిలో నష్టాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్న సినిమా బాగున్నా పెద్ద సినిమా కోసం పక్కకు నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, తాను తెరకెక్కించిన ‘గేట్’ చిత్రం సైతం ఇదే పరిస్థితుల్లో ఉందని, నిర్మాతల నుంచి తనకు రావాల్సిన డబ్బు కూడా అందలేదని ఆరోపణలు చేసారు. చాంబర్ పెద్దలు తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. 2014లో షూటింగ్ చేసుకున్న ఈ సినిమాల ట్రైలర్ ను 2015లో విడుదల చేయగా, ఇప్పటివరకు విడుదలకు నోచుకోకపోవడం విశేషం. అయితే ఈ సమస్య ఒక్క రాజేష్ సాయిది మాత్రమే కాదు, చాలామంది చిన్న దర్శకనిర్మాతలది. మరి వీటిని భుజాన వేసుకునే పెద్ద దిక్కు ఎవరు? అన్నది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…