Telugu

సోషల్ మీడియాలో ఆ ఇద్దరికీ ఫుల్ వాషే..?

2024 జులై లో భారత క్రికెట్ జట్టు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ సమయం ముగియడంతో కొత్త కోచ్ గా నియమించబడ్డారు మాజీ భారత బ్యాటర్ గౌతమ్ గంభీర్. అప్పట్లో ఆ న్యూస్ హాట్ టాపిక్ అవ్వడంతో పాటుగా ఆ ఏడాది కేకేఆర్ టీంకి ఐపీఎల్ ట్రోఫీ ను గెలిపించిన కోచ్ గా కూడా గంభీర్ ప్రముఖంగా వార్తలలో నిలిచాహరు.

అటువంటి వ్యక్తి ఇప్పుడు టీం ఇండియా హెడా కోచ్ గా భారత్ టీంలోకి ఎంట్రీ ఇవ్వడంతో క్రికెట్ అభిమానులలో ఆకస్తి నెలకొంది. అయితే హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ తన తొలి వన్-డే సిరీస్ లోనే పరాజితులయ్యాడు.

ADVERTISEMENT

ఇక, ఆ తరువాత జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ భారత క్రికెట్ కు ఒక బ్లాక్ మార్క్ లాంటిదనే చెప్పాలి. గత 24 ఏళ్లగా సొంత గడ్డపై వైట్-వాష్ కు గురవ్వని టీం ఇండియా గౌతమ్ గంభీర్ కోచింగ్ హయాంలో హోమ్ గ్రౌండ్ లో 3-0 తో సిరీస్ ను ఘోరంగా ఓడింది. అలాగే, ఆ తరువాత ఆడిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ను సైతం ఓడి టెస్ట్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది.

ఒక పక్క టి-20 లు మాత్రం సిరీస్ మీద సిరీస్ గెలుస్తూ ఎవ్వరికి అందని ఎత్తులో ఉంది టీం ఇండియా. మరో పక్క వన్-డే ఫార్మాట్ లో యావరేజ్ ప్రదర్శనతో సరిపెట్టుకుంటుంది భారత్. అయితే, సిరీస్ అన్నాక గెలుపోటములు సహజమే, కానీ గంభీర్ కోచ్ కాకముందు మునుపటి కోచ్/ఆటగాళ్ల పై పలుసార్లు ఘాటైన కామెంట్స్ చేసారు.

మరి అలాంటి కామెంట్స్ చేసిన వ్యక్తి నేడు తన హయాంలో ఇలాంటి ఫలితాలు చూపిస్తే సహజంగా అందరూ ట్రోల్ చేస్తారు. రవి శాస్త్రి కోచింగ్ హయాంలో ఆయన్ని పలుసార్లు దూషించారు గంభీర్. మరి నేడు నీవు సాధించిందేంటి అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గంభీర్ ని అడిగి కడిగేస్తున్నారు.

నేడు సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన 2 మ్యాచ్ లు కూడా ఓడిపోయి సిరీస్ ను 2-0 తో కోల్పోయారు. ఈ మ్యాచ్ ను భారత్ ఏకంగా 408 భారీ తేడాతో కోల్పోయి ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. నేడు ఈ పరిస్థితి కి అభిమానులు కేవలం గంభీర్ మాత్రమే కారణమనట్లా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై కూడా సోషల్ మీడియా ఫైర్ అవుతుంది.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘రో-కో లు బాగా ఆడినప్పటికీ, వారి సెలెక్షన్ ప్రస్నార్ధకమే’ అంటూ చాలా ఘాటైన కామెంట్స్ చేసారు అజిత్. నేడు తన సెలెక్టెడ్ టీమ్ ఇంత ఘోరమైన ఓటమికి కారణమయినందుకు తనను ఎలా మేము ఒప్పుకోవాలి అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, సిరీస్ ఓటమి తరువాత గంభీర్ ప్రెస్-మీట్ లో ‘ఓటమి కి మాత్రమే నేను భాధ్యుడినా? నా హయాంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచాం’ అంటూ చేసిన కామెంట్స్ కు కూడా ఘాటు రిప్లయిలే వస్తున్నాయి.

మరి నీ స్థానంలో పూర్వం ఇతరులు ఉన్నప్పుడు నీవు వాళ్ళని దూషించకుండా ఉండి ఉంటె, నేడు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇక, తాజాగా నేషనల్ జట్టుకు ఒక ఆటగాడు ఆడాలి అనుకుంటే ఆ ఆటగాడు కచ్చితంగా దేశవాళీ టోర్నీ లలో పాల్గొని, అక్కడ నిరూపించుకున్నాకనే దేశ జట్టుకు ఎంపికవుతారు, అది సీనియర్లయినా జూనియర్ లైనా, అనే మాట కు ‘కోచ్ మరియు సెలెక్టర్ కూడా దేశవాళీ టోర్నీ లో నిరూపించుకోవాలి’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్. చూడాలి మరి, గంభీర్-అగార్కర్ పై ఈ ట్రోలింగ్ ఎప్పుడు ఆగుతుందో అని..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

జగన్‌ శత్రువు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ కాదుగా?

ఉద్యోగాల కల్పన అంటే నెలకు రూ.5,000 జీతంతో వాలంటీర్లు నియమించుకొని పార్టీ కోసం పని చేయించుకోవడమా? లేక పోలీస్, విద్యా…

23 minutes ago

TFTDDA Power Fight Gets a Court Twist

The TFTDDA power struggle has taken a serious legal turn. A court has stopped the…

27 minutes ago