
ఇదిలా ఉంటే, అసలు ఈ సినిమాపై ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కారణమైన అంశం… ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ధియేటిరికల్ ట్రైలర్ అన్న విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదలైన నాటి నుండి ఈ సినిమాపై నమ్మకాలు ఏర్పడ్డాయి. అందుకే నెటిజన్లు ఈ ట్రైలర్ కు పట్టాభిషేకం చేస్తూ… అరుదైన రికార్డులను సొంతం చేసిన విషయం కూడా విదితమే. తాజాగా ఈ ట్రైలర్ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది.
తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు యూ ట్యూబ్ లో ‘ఒక లక్ష లైక్స్’ అందుకున్న తొలి ట్రైలర్ గా చరిత్ర సృష్టించింది. తెలుగు వాడి సత్తాను యూ ట్యూబ్ నుండే ప్రేక్షకులు తెలపడం ప్రారంభించారు అనే దానికి నిదర్శనంగా ఈ ట్రైలర్ నిలుస్తోంది. అలాగే ఇప్పటివరకు ఈ ట్రైలర్ 7 మిలియన్ క్లిక్స్ అందుకుంది. బహుశా సినిమా విడుదలైన తర్వాత ఈ ట్రైలర్ కు మరింత స్పందన వచ్చినట్లుగా కనపడుతోంది.
Ram Charan’s upcoming film Peddi, directed by Buchi Babu Sana, is generating strong buzz not…
The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…