
ముఖ్యంగా బాలయ్యకు బాగా అచ్చివచ్చిన సంక్రాంతి పండుగకు 100వ సినిమాను తీసుకురావడం సెంటిమెంట్ గా కూడా అభిమానులకు పాజిటివ్ సంకేతాలను ఇస్తోంది. మే 9 మొదలుకుని నిరంతరాయంగా షూటింగ్ జరిపేందుకు బాలయ్య బాబు డేట్స్ ఇచ్చారని, దాదాపు ఆరు మాసాలలో షూటింగ్ పూర్తయ్యే విధంగా పక్కా ప్లానింగ్ తో సినిమా పూర్తి కానుందని, షూటింగ్ ఒక దశకు చేరుకున్న తర్వాత గ్రాఫిక్స్ వర్క్ కూడా జరిపేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ‘బాహుబలి’ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకేక్కిస్తానని క్రిష్ ఇప్పటికే స్పష్టం చేయడంతో నందమూరి అభిమానులు 100వ సినిమా విజయంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ చారిత్రాత్మక చిత్రంలో నటించేందుకు బాలయ్య మంచి ఉత్సాహంలో ఉండడంతో… తెలుగు చిత్ర సీమలో సువర్ణాక్షరాలతో లిఖించే చిత్రంగా నిలబడాలని ఆశిద్దాం.
Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్‌తో…