
అభిమానులను ఊరించే విధంగా ఈ రెండు షాట్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం, ఉత్తేజం ఉరకలేస్తోంది. రాజ్యానికి సంబంధించిన సెట్టింగ్ ఒక షాట్ కాగా, పోరాట సన్నివేశంలో భాగంగా గుర్రాలు పరుగులెత్తే షాట్ మరొకటి. దీంతో “గౌతమీపుత్ర శాతకర్ణి” ట్రైలర్ కన్నుల విందుగా ఉంటుందన్న సంకేతాలు ఈ షాట్స్ కలిగిస్తున్నాయి. అంతేకాదు, తక్కువ బడ్జెట్ లోనే గ్రాండ్ లుక్ ను తీసుకురావడంలో దర్శకుడు క్రిష్ సూపర్ సక్సెస్ అయ్యారన్న నమ్మకాన్ని కూడా వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.
16వ తేదీన సాయంత్రం 5.15 నిముషాలకు విడుదల కానున్న ట్రైలర్ ముచ్చట్లు ఇలా ఉంటే, ఆడియో వేడుక ఈ నెల 26వ తేదీన తిరుపతిలోని ఎస్వీ గ్రౌండ్స్ లో అత్యంత వైభవంగా విడుదల కానుంది. ఇక, సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారీ స్థాయిలో విడుదల కానున్న ట్రైలర్ గనుక అంచనాలను అందుకోగలిగితే… సినిమా సక్సెస్ లో సగం వంతు పూర్తయినట్లే భావించవచ్చు. దీంతో అందరి చూపులు “గౌతమీపుత్ర శాతకర్ణి” వైపుకే..!
రాజకీయాలలో ఎల్లప్పుడూ శత్రుత్వమే కాదు మర్యాదలు, సత్ సాంప్రదాయాలు, ఆనవాయితీలు కూడా పాటించడం అవసరం. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి,…
Social media was buzzing recently with news that Ranveer Singh bought the rights to Amish…