Telugu

ట్రైలర్ టాక్ – నందమూరి ఫ్యాన్స్… మీసం మేలేయండి…!

ఒక నటుడి కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా అంటే ఎలా ఉండాలి? హిట్, ఫ్లాప్ విషయం పక్కన పెడితే… ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోవాలి. సరిగ్గా అలాంటి కధనే నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంచుకున్నారని చెప్పాలి. ఎవరికీ తెలియని కధను దర్శకుడు క్రిష్ తెరమీదకు తీసుకురావడం, దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… రూపాంతరం చెందిన “గౌతమీపుత్ర శాతకర్ణి” ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాలతో విడుదలైన ఈ ట్రైలర్ అంచనాలను అందుకోవడమే కాదు, సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడేలా చేసింది. “గౌతమీపుత్ర శాతకర్ణి” టైటిల్ రోల్ పోషించిన బాలకృష్ణ చూడడానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, కధ పరంగా బాలయ్య డైలాగ్ డెలివరీనే హైలైట్ గా కనపడుతోంది. ధియేటర్లో అభిమానులు విజిల్స్ వేయాల్సిందే అనే రేంజ్ లో బాలయ్య తన డైలాగ్స్ ను పలికించాడు.

ADVERTISEMENT

ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా ‘ఏది ఏమైనా… దేశం మీసం తిప్పుదాం…’ అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ కు వీక్షకులు ఫిదా అవుతున్నారు. బాబా అందించిన ఫోటోగ్రఫీ అదుర్స్ అనిపించే విధంగా ఉండగా, చైరంతాన్ భట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ను బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. ఇక చెప్పుకోవాల్సిందంతా దర్శకుడు క్రిష్ గురించే..!

‘బాహుబలి’ మాదిరి స్టన్నింగ్ విజువల్స్ ను ఒక సాధారణ బడ్జెట్ లో చిత్రీకరించడం బహుశా క్రిష్ ఒక్కరికే సాధ్యమేమో అనిపించే విధంగా ఈ ట్రైలర్ కనపడుతోంది. చూడడానికి చాలా రీచ్ గా కనపడుతున్న ఈ సినిమా బడ్జెట్ పరిమితం అన్న విషయం తెలిసిందే. బాలయ్యకున్న మార్కెట్ కు అనుగుణంగా ఖర్చుపెట్టి, ఇంత గ్రాండ్ లుక్ రావడం వెనుక టాలెంట్ క్రిష్ దేనని చెప్పాలి.

చూడబోతుంటే… 2017 సంక్రాంతికి నందమూరి అభిమానులు మీసం మేలేయడం ఖాయంగా కనపడుతోంది.`

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇంటింటికీ తెలుగుదేశం… కోటి ధన్యవాదాలు!

కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…

53 minutes ago

Jagan Locked Period, But Who Will Back Him?

The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…

1 hour ago