
[m9ad]
స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు చేపట్టిన విచారణలో గుంటూరు సమీపంలోని రెండు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సినిమా సీన్లను షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… అమరావతి పరిధిలోని తాడేపల్లి, కేఎల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని తమకు ఈ సినిమాను పంపించిందని చెప్పారు.
ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకుని ఈ లీక్ వెనకున్న అసలు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఆ అమ్మాయికి పరిచయమున్న ఓ యువకుడు హైదరాబాద్ లో సినిమా ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడని, అతనే తన వద్ద ఉన్న సినిమాను అత్యుత్సాహంతో ఆమెకు పంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఈ లీకేజ్ కేవలం కొన్ని సన్నివేశాల వరకేనా? లేక పూర్తి సినిమా లీక్ అయ్యిందా? అనే దానిపై అధికారిక సమాచారం లేదు గానీ, పెన్ డ్రైవ్ లో సర్క్యూలేట్ కావడంపై పలు సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పలు పెద్ద హీరోల సినిమాల ‘రా ఫుటేజ్’లు కూడా లీక్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు.
Following the commercial success of Good Bad Ugly, actor Ajith Kumar took a short break…
The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…