
రికార్డ్ ఓపెనింగ్స్ తో మోత మోగించిన “గీత గోవిందం” నుండి ముందుగా లీక్ అయిన లిప్ లాక్ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ బాగా ట్రిమ్ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ షాట్ లో రష్మిక-విజయ్ ల మధ్య బస్సులో చిత్రీకరించిన ఈ లిప్ లాక్ సన్నివేశం ముందుగా లీకై అందరూ చూసేసారని అనుకున్నారో ఏమో గానీ, తెరపై బాగా షార్ట్ చేసారనే టాక్ ఊపందుకుంది.
బహుశా ముందుగా లీక్ చేసినందుకు ప్రేక్షకులపై రివేంజ్ తీర్చుకునే విధంగా ఈ షాట్ ను ట్రిమ్ చేసారో లేక ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కట్ చేసారో లేక సెన్సార్ బోర్డు నిబంధనలతో లేపెసారో గానీ, సోషల్ మీడియాలో ఈ లిప్ లాక్ సన్నివేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అయినా సినిమా అంతా నడిచేది ఒక్క లిప్ లాక్ సన్నివేశం గురించే కదా!
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…
With the theatrical run and OTT release behind it, the entire cycle of The Paradise…