
ఈ క్రమంలో తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఆమె డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం కేసు పెట్టారు. తనను బెదిరిస్తూ పెట్టిన మెసేజ్ లను పోలీసులకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గజల్ శ్రీనివాస్ గత కొంత కాలంగా తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారని చెప్పారు. మరోవైపు, శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని గజల్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…