
వీటిల్లో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా రెండు ఫ్లై ఓవర్లు వెళ్లనుండగా, అందులో ఒకదాని అప్రోచ్ ఫ్లై ఓవర్ డిజైన్ సరిగ్గా బాలకృష్ణ ఇల్లు ఉన్న ప్రాంతం గుండా వెళ్లనుందని తెలుస్తోంది. ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, వాటి నిర్మాణం చేపడితే, దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ కట్టించుకుని, ఆపై బాలకృష్ణకు ఇచ్చిన ఇంటిని కూల్చివేయక తప్పదని సమాచారం.
కాగా తొలి దశలో చేపట్టే వంతెనల నిర్మాణానికి 2,631 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2019 చివరికి ఎస్ఆర్డీపీని పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకుంది. పనులు గనుక ప్రారంభమైతే మొత్తం 581 నిర్మాణాలను కూల్చివేయాల్సి వుంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో పలువురు ప్రముఖులు ప్రస్తుతం ఉంటున్న నివాసాలతో పాటు, పలు జంక్షన్లలో ఎంతో కాలంగా ఉంటున్న ప్రముఖ రెస్టారెంట్ లు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా ఉన్నాయి.
దీనిపై తాజాగా ఓ అధికారిక సమాచారం కూడా వెలువడింది. పర్యావరణ ట్రైబ్యునల్ అనుమతులు లభిస్తే వెంటనే జూబ్లీహిల్స్ లో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, ఇందు నిమిత్తం “మీ ఇంటిలో కొంత భాగం కూల్చాల్సి వస్తుందని” ఇప్పటికే బాలకృష్ణను సంప్రదించామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలయ్య ఉంటున్న 1355 నంబర్ గల ఇంటి నుండి ఎన్టీఆర్ భవన్, కేబీఆర్ పార్కు మీదుగా, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు పక్కగా రోడ్ నంబర్ 45 వరకు కలిపేలా ఫ్లై ఓవర్ డిజైన్ ఉంది. దీంతో జీహెచ్ఎంసీ నిర్ణయంపై బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి వుంది.
Mumbai Indians are officially out of IPL 2026, and the spotlight is once again firmly…
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…