Telugu

కలియుగం మనమే ముగించేద్దాం!

ఈ ప్రపంచం అంతమైతే ఎంత భయానకంగా ఉంటుందో ‘2012’ సినిమాలో చూపారు. ఇంకా చాలా సినిమాల్లో చూపిస్తూనే ఉన్నారు. వెనిజులాలో వచ్చిన భూకంపం, దాని ప్రభావం, ఎల్‌నినో కారణంగా వర్షాభావం ఏర్పడటం వంటివి చూస్తున్నప్పుడు సినిమాల్లో చూపిస్తున్నట్లే బయట ప్రపంచంలో కూడా జరుగుతున్నాయనిపిస్తుంది.

ఈ ప్రకృతి విపత్తులు, ఏఐ కారణంగా నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య సరిపోవన్నట్లు అమెరికా-ఇరాన్‌, రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేస్తున్నాయి.

ADVERTISEMENT

అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందంతో యుద్ధం ముగిసిందని అందరూ భావించారు. కానీ హోర్ముజ్ జలసంధిలో ఓ వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి చేయడంతో వెంటనే అమెరికా కూడా ఇరాన్‌పై వైమానిక దాడులు చేసింది. కనుక మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది.

ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై నాలుగేళ్లు. ఈ యుద్ధం కారణంగా రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. కనుక ఇకనైనా ముగిస్తాయనుకుంటే మళ్లీ రష్యాపై ఉక్రెయిన్‌ వందల కొద్దీ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కనుక రష్యా కూడా దీటుగా స్పందిస్తోంది.

కొన్ని దేశాల అధినాయకుల యుద్ధోన్మాదం వలన యావత్ ప్రపంచ దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. యుద్ధాల వలన నష్టమే తప్ప సాధించేది ఏమీ ఉండదని తెలిసి ఉన్నప్పటికీ వారు యుద్ధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ యుద్ధాలు ఆపగలమని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నాలుగు నెలలుగా ఇరాన్‌తో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం చేస్తారో కూడా తెలీని పరిస్థితి.

ఈ యుద్ధాలు ఇలాగే కొనసాగుతుంటే, ఏదో ఓ సమయంలో ఇతర దేశాలు కూడా యుద్ధంలో ప్రవేశించడం తథ్యం. అప్పుడు అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం తథ్యం.

ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తున్నప్పుడు కలియుగాన్ని మనమే చేజేతులా అంతం చేసుకోబోతున్నామా? అనే సందేహం కలుగుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘Husharu 2’ Returns With a New Adventure

The makers of the 2018 youth entertainer ‘Husharu’ have officially announced its sequel, ‘Husharu 2’.…

17 minutes ago

Drishyam 3: Ajay Turns Franchise King, But at What Cost?

Ajay Devgn’s Drishyam: The Conclusion is doing wonders at the box office. The movie has…

37 minutes ago