
టాలీవుడ్ లో ఉన్నంత వరకు ఓ రకంగా బయట ప్రపంచానికి కనిపించిన ఇలియానా, బాలీవుడ్ కు చేరుకున్న తర్వాత తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. బాలీవుడ్ నాట సక్సెస్ ఎంతవరకు వచ్చిందో పక్కన పెడితే, ఇలియానా గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది.
చివరగా ‘బిగ్ బుల్’లో కనిపించిన ఇలియానా, గడిచిన కొంతకాలంగా ఒకే రకమైన ఫోటోలను పోస్ట్ చేస్తోంది. బహుశా ఎవరికో ఏదో చెప్పాలి, ప్రూవ్ చేసుకోవాలన్న తాపత్రయం ఈ పిక్స్ ద్వారా వ్యక్తపరుస్తుందేమో గానీ, డైలీ అప్ డేట్స్ తో దాదాపుగా 14 మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకుంది.
జిమ్, సన్ బాత్, స్విమ్మింగ్ పూల్, బీచ్… ఇలా సమయం, సందర్భం ఏదైనా గానీ ఇలియానా పిక్స్ యొక్క దృష్టి మాత్రం ఒక దగ్గరే చూపించే విధంగా పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవులు కేంద్రంగా గోవా బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఉన్నన్నాళ్ళు ముడుచుకున్న వారంతా తదుపరి కాలంలో ఇలా స్విమ్ సూట్స్, బికినీల అందాల విందుతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఈ బ్యూటీలంతా తెలుసుకోవాల్సింది ఏమిటంటే… హీరోయిన్ల కంటే ఆడియన్స్ ముందే అప్ డేట్ అయిపోతున్నారని!
ఎంత అందాల విందు చేసినా కాలానుగుణంగా మరుగున పడిపోవడం ఎంతటి హీరోయిన్ కైనా తప్పదు. దానిని ఒప్పుకుని ముందుకు సాగకుండా, ఇంకా ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఇలియానా పడుతోన్న తాపత్రయం దేనికి? టాప్ హీరోయిన్ గా కెరీర్ ముగిసిపోయిన తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రేయా మంచి రోల్స్ చేస్తోంది. బహుశా ఈ యాంగిల్ లో ఆలోచిస్తే గోవా బ్యూటీ మరికొన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ పై మెరిసేదేమో!
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…