Telugu

గాడ్ ఆఫ్ వార్… ఇది త్రివిక్రమ్‌ చేయాల్సిన యుద్ధమే!

పౌరాణికాలు, చారిత్రక సినిమాలకు కొత్త కాదు. కానీ సాధారణ సినిమాలతో పోలిస్తే ఇటువంటి సినిమాల విషయంలో ప్రేక్షకుల అంచనాలు భిన్నంగా ఉంటాయి.

ఒక కమర్షియల్ సినిమాలో దర్శకుడు తనకు నచ్చినట్లు మార్పులు, చేర్పులు చేయవచ్చు. కానీ పురాణ, చారిత్రిక గాధలు, వాటిలో పాత్రలు, సన్నివేశాల విషయంలో ప్రజలు భావోద్వేగంతో స్పందిస్తారు.

ADVERTISEMENT

చారిత్రిక, పౌరాణిక సినిమాలు కేవలం వినోదానికి సంబంధించినవి మాత్రమే కావు. కోట్లాది మంది భక్తి, విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రిక విశిష్టత, దేశభక్తి, గౌరవంతో ముడిపడి ఉంటాయి.

కనుక దర్శకులు, హీరోలు గొప్ప పౌరాణిక, చారిత్రక సినిమాలు తీయవచ్చు. కానీ వాటిని వక్రీకరించవద్దని, పాత్రలను కించపరచవద్దని, ప్రజల విశ్వాసాలను దెబ్బతీయవద్దని ప్రజలు కోరుకుంటారు.

ఇప్పుడు జూ.ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గాడ్ ఆఫ్ వార్’ అనగానే మళ్ళీ ఇదే చర్చ మొదలైంది. ఆయన సినిమాల్లో చమత్కారం, వ్యంగ్యం, అర్ధవంతమైన ఆకట్టుకునే డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

కానీ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఆయన గౌతమ మహర్షి, అహల్య కథతో చేసిన హాస్య ప్రయోగాన్ని చాలా మంది ఆస్వాదించినప్పటికీ, కేవలం కామెడీ కోసమే హిందువులకు పరమపూజ్యనీయులైన వారిని ఉద్దేశ్యించి అంత చులకన చేస్తూ సన్నివేశం సృష్టించడాన్ని చాలా మంది అప్పుడే తప్పు పట్టారు.

అప్పటి విషయం ఇప్పుడు దేనికంటే‘గాడ్ ఆఫ్ వార్’లో అలా వక్రీకరించడం మంచిది కాదని చెప్పడానికే. ఈసారి పూర్తి పౌరాణిక సినిమా చేయబోతున్నారు కనుక బహుశః అటువంటి చవుకబారు హాస్యం జోడించకపోవచ్చు.

కానీ ఇది జూ.ఎన్టీఆర్‌తో యాక్షన్ మూవీగా చూపబోతున్నట్లయితే ఇదొక పౌరాణిక సినిమా అని. దీనిలో ప్రేక్షకులు భక్తి, దైవత్వం, పాత్రల ఔనత్యం చాలా ముఖ్యమని భావిస్తారనే సంగతి గుర్తుంచుకోవాలి.

‘చావా’ సినిమా చూసి దేశ ప్రజలందరూ ఏవిధంగా దేశభక్తితో పులకించిపోయారో అదేవిధంగా ఈ సినిమా చూసి పులకించిపోయేలా ఉండాలి. తప్ప జూ.ఎన్టీఆర్‌ హీరో కనుక ఇదొక యాక్షన్ సినిమాగా భావిస్తూ అతిగా రక్తపాతం, అతిగా గ్రాఫిక్స్‌, అతిగా కంప్యూటర్ విజువల్స్ వంటివి జోడిస్తే మొదటికే మోసం వస్తుందని గుర్తుంచుకోవడం చాలా అవసరం.

వందల కోట్లతో తీసిన అలాంటి సినిమాలను ప్రజలు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినట్లే మన సినిమాని తిరస్కరిస్తారనే స్పృహ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి ఇప్పుడు చాలా అవసరం. అందుకే ఇది ‘గాడ్ ఆఫ్ వార్‌’ కాదు. ఆయన చేయాల్సిన యుద్ధమే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI T20Is: Where to Watch, Pitch Report & Playing XI?

India and West Indies will begin their five match T20I series on Tuesday, October 6,…

25 minutes ago

From Co-Stars To Life Partners: Rashmika-Vijay’s Journey

For years, Vijay Deverakonda and Rashmika Mandanna's relationship remained one of the most closely followed…

55 minutes ago