Telugu

‘గోల్డెన్ బే రిసార్ట్’ బిల్లుకు దారేది?

గత కొన్ని రోజులుగా గోల్డెన్ బే రిసార్ట్ వేదికగా జరిగిన రాజకీయం అందరికీ తెలిసిందే. తన వర్గీయులను గోల్డెన్ బే రిసార్ట్ లో ఉంచి, శశికళ సకల సౌకర్యాలు కల్పించిన సంగతులు అలా ఉంటే, ఆ తర్వాత బయటకు వచ్చిన ఎమ్మెల్యేలకు దాదాపుగా 60 లక్షల రూపాయల బిల్లును చేతిలో పెట్టగా, వారు కేవలం 5 లక్షల రూపాయలను మాత్రమే చెల్లించారని తెలుస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు దాదాపుగా 120 ఎమ్మెల్యేలకు మరియు బౌన్సర్లకు గానూ ఈ మొత్తం అయ్యిందని సమాచారం.

ఈ ఎమ్మెల్యేలు మొత్తం బయటకు వెళ్ళిన తర్వాత ఏకంగా రిసార్ట్ మూసివేసి, మరమ్మత్తులు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తగా, ఇపుడు మిగిలిన 55 లక్షల రూపాయలు ఎవరు చెల్లిస్తారో తెలియక, సదరు రిసార్ట్ యాజమాన్యం తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తింది. శశికళ జైలుకు వెళ్ళిపోగా, పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఈ బిల్లును సిఎంకు పంపే సాహాసం చేయకపోవచ్చు గానీ, వారి అనుచర వర్గానికి అయినా తెలియజేయాలో లేదో అన్న మీమాంసలో రిసార్ట్ యాజమాన్యం తలమునకలై ఉన్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Ideological Spark: Udhayanidhi Resurrects ‘Sanatana’ Row in Assembly

The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…

19 minutes ago

The Selective Silence: Rahul Ramakrishna Slams Film Fraternity’s ‘Cine-Cats’

Actor Rahul Ramakrishna has sparked a fresh debate on social media by calling out the…

39 minutes ago