Telugu

‘జంప్ జిలానీ’ ఎమ్మెల్యేలకు పండగ లాంటి వార్త!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చే శాసనసభ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యే ఆశావహులకు ఇది పండగ లాంటి వార్త. అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలకూ శుభవార్తే. అధికారంలోకి వచ్చాక అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీల్లోకి వలసలు పెరిగి, పెద్ద సంఖ్యలో పార్టీల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీలైనంత మందికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో చేరిన వారికి, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం చేయాలని టీఆర్ఎస్, టీడీపీలు భావించాయి.

ADVERTISEMENT

నియోజకవర్గాల పెంపుతోనే అది సాధ్యమవుతుందన్న నమ్మకంతో జంప్ జిలానీలకు ఎడాపెడా హామీలు ఇచ్ఛాయి. అయితే కొంతకాలంగా ఈ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడం, రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది గనుక ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే విషయం కాదనడంతో కొంత నిరుత్సాహం చెందాయి. కానీ, తాజాగా ఈ ప్రతిపాదనలో కదలిక రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో ఉన్న 175 స్థానాలను 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది.

ఈ విషయంలో గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నియోజకవర్గాల పెంపు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్’ పంపాలని కేంద్ర న్యాయశాఖ రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. లోక్‌ సభ స్థానాల పెంపు సాధ్యం కాకపోవడంతో, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలను మాత్రం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను తొమ్మిదికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

తెలంగాణ రాజకీయం: టీడీపీ వదిలినా.? తెలంగాణ వదలదా.?

తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…

33 minutes ago

Rashmika No. 1: Can She Stay Ahead of Deepika, Alia & Sai?

Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…

56 minutes ago