
[m9ad]
చూసిన ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో సక్సెస్ అయిన చిత్ర యూనిట్, విలన్ విషయంలో మాత్రం మాంచి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆ ఆసక్తి అలాగే ఉండాలన్న కోణంలో విలన్ గా పోషించిన పేరును బయట పెట్టడం లేదు గానీ, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఒక నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా ఏమిటో అడవి శేష్ ఈ సినిమాతో నిరూపించుకున్నారు.
ఉన్నతమైన సాంకేతిక విలువలతో అగ్ర హీరోల మూవీల మాదిరి రూపొందించిన ఈ సినిమాకు ఎంపిక చేసుకున్న కాస్టింగ్ ప్రధాన ప్లస్ పాయింట్. అరుదుగా కనిపించే నటీనటులను ఎంపిక చేసుకోవడమే కాకుండా, రొటీన్ గా కనిపించే వారిని కొత్తగా చూపించి ప్రేక్షకులకు ఫ్రెష్ నెస్ ను కలిగించింది. బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సందడి చేసే చిత్రంగా ఈ “గూఢచారి” నిలుస్తుందన్న ‘ఫస్ట్ టాక్’ ముక్తకంఠంతో వెలువడుతోంది.
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…
With the theatrical run and OTT release behind it, the entire cycle of The Paradise…