
పోస్టర్ బ్యాక్ డ్రాప్ లోని ముస్లిం ప్రదేశం టెర్రరిస్టు బ్యాక్ గ్రౌండ్ ను సూచిస్తున్నాయి. ఏక్ తా టైగర్ లో సల్మాన్ ఖాన్ కూడా ఒక మిషన్ మీద ఆఫ్ఘానిస్తాన్ వెళ్తాడు. ఆ చిత్రంలో సల్మాన్ తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ లాంటిది ఉంటుంది ఈ పోస్టర్ లో గోపీచంద్ కూడా అలానే ఉన్నారు. దీని బట్టి సినిమా ఫ్రీ మేక్ అనే వదంతులు నిజామా అనిపించక మానదు. లేకపోతే సినిమా రీమేక్ రైట్స్ కొని ఆ విషయం దాస్తున్నారా అని కూడా అనిపించవచ్చు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. చాలా భాగాన్ని నార్త్ ఇండియాలో తీశారు. ఎఫ్ 2 తో భారీ విజయాన్ని అందుకున్న మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మెహరీన్ తో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జరీనా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2014 లో లౌక్యం తరువాత గోపీచంద్ కు ఒక్క హిట్ కూడా లేదు. ఆ తరువాత వరుసగా ఆరు ప్లాపులు ఇచ్చారు గోపీచంద్. ఇప్పుడు ఏకంగా ఆయన మార్కెట్ జీరో అయ్యే పరిస్థితి ఉంది. ఈ సినిమాతోనైనా ఆయన హిట్ సాధిస్తారేమో చూడాలి.
Prabhas’ Fauzi teaser received a mixed response on social media, with criticism over its visual…
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…