Telugu

పంచాయతీలు వద్దు సచివాలయాలే ముద్దు

ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి అధికారంలోకి రాగానే నిరర్ధక మంత్రిత్వశాఖలను, పదవులను రద్ధు చేశారు. తద్వారా ప్రభుత్వంపై ఆర్ధిక భారం, పనిలో జాప్యం తగ్గించుకొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే అప్పటికే ఉన్న పురపాలక, పంచాయితీ వ్యవస్థలకు అదనంగా సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను సృష్టించి ప్రభుత్వంపై గణనీయంగా భారం పెంచుకొన్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత మునిసిపల్, పంచాయితీ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయితీలకు నిధులు విడుదల చేస్తుంటుంది కానీ వైసీపి ప్రభుత్వం వాటిని దారి మళ్లించి వాడేసుకొంటోందని కేంద్రమంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలే పలుమార్లు ఆరోపించారు. ఈ కారణంగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు లేక పంచాయతీలు అల్లాడుతున్నాయి.

ADVERTISEMENT

వైసీపి ప్రభుత్వాన్ని నమ్ముకొని రాష్ట్రంలో అనేకమంది సర్పంచ్‌లు సొంత డబ్బుతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేయిస్తే వారికి నిధులు మంజూరు చేయకపోవడంతో వారూ అప్పుల పాలవుతున్నారు. వారి కంటే సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకే సకాలంలో జీతాలు, ప్రజలలో గౌరవం కూడా లభిస్తోంది.

పంచాయితీలకు నిధులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసివస్తోంది. మరో విషయం ఏమిటంటే సచివాలయాలపై పంచాయితీలకు ఎటువంటి అజమాయిషీ లేదు కానీ సచివాలయాల నిర్వహణ ఖర్చులు అంటే వాటి విద్యుత్ బిల్లులు వగైరా భారం పంచాయితీలే భరించాల్సి వస్తోంది. అయితే పంచాయితీలు తమ సొంత విద్యుత్ బిల్లులు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నాయి!

సచివాలయాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలా పనిచేస్తుంటే, రాజ్యాంగబద్దంగా ఏర్పడిన పంచాయితీలు నిధుల లేక సమస్యలతో అల్లాడుతున్నాయి.

సచివాలయ వ్యవస్థలను సృష్టించినప్పటి నుంచి వాటికీ పురపాలక, పంచాయితీ కార్యాలయాల మద్య పనుల విభజన కూడా మరో సమస్యగా మారుతోంది. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి. సచివాలయాలు అన్ని హంగులూ ఉన్న వైసీపి కార్యాలయాలుగా మరాయంటే అతిశయోక్తి కాదు. అందుకే వైసీపి ప్రభుత్వానికి పంచాయితీలు వద్దు సచివాలయాలు ముద్దు అనుకోవాలేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

2 hours ago

AP Civic Polls: TDP Gets 11 Corporations, Jana Sena 4, BJP 2

The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…

2 hours ago