
ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నా ఇంతవరకు వైసీపీలో ఎవరూ పెద్దగా స్పందించలేదు. తొలిసారిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ నిన్న అనకాపల్లిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “దగ్గుబాటి పురందేశ్వరిగారు… ఇంతకీ మీరు ఏ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు? బిజెపికా లేక టిడిపికా? ఎందుకంటే మీడే మాటలన్నీ చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ లో ఉన్నట్లే ఉన్నాయి. ఒకవేళ మీరు మీ మరిది చంద్రబాబు నాయుడుకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లయితే ముందు మీరు ఆయననే ఈ ప్రశ్నలన్నీ అడగాలి. మీరు చెపుతున్న లెక్కలన్నీ కేంద్రం చెప్పిన లెక్కలు కాదు చంద్రబాబు వ్రాసిచ్చిన లెక్కలని అర్దమవుతూనే ఉంది.
మీరు కూడా ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి ఎందుకు తాపత్రయపడుతున్నన్నారు? కేంద్రం అంతిచ్చేసింది…ఇంతిచ్చేసిందని దానిని మేము దుబారా చేసేస్తున్నామంటూ ఏదేదో మాట్లాడారు. రాష్ట్రానికి రావలసిన దానినే కేంద్రం ఇచ్చింది తప్ప అదనంగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. దీనిపై మేము బహిరంగ చర్చకు సిద్దం. మీరు సిద్దమేనా?
నాలుగేళ్ళుగా మీకు మా ప్రభుత్వంలో ఎటువంటి లోపమూ కనబడలేదు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి లభించగానే అన్నీ తప్పులు, లోపాలే కనిపిస్తున్నాయా?మీరు మీ మరిదిగారు చెప్పిన మాటలను వల్లిస్తూ ఆయనకు వత్తాసు పలకడం మానుకొని కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి ప్రయత్నిస్తే బాగుంటుంది,” అని అన్నారు.
ఇదివరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి వచ్చి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించినప్పుడూ, వారు టిడిపి ప్రభావంతో ఆ విమర్శలు చేశారని వైసీపీ సర్ధిచెప్పుకొంది. పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నప్పుడు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేందుకే మమ్మల్ని విమర్శిస్తున్నారంటూ సమర్ధించుకొంటున్నారు.
ఇప్పుడు పురందేశ్వరి కేంద్రం ఇచ్చిన గణాంకాల ఆధారంగా నిలదీస్తుంటే ఆమె కూడా చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిప్టే చదువుతున్నారని, ఆమె కూడా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసేందుకు ఆరాటపడుతున్నారని మంత్రి గుడివాడ తేల్చిపడేశారు.
ఈ లెక్కన చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతులని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు ఇంతమంది తాపత్రయపడుతునందుకు!
Bhuvneshwar Kumar is back in India's T20I squad after nearly four years, with the experienced…
కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచన చేస్తున్నప్పుడే చిన్న శ్రీనుతో సహా పలువురు టీడీపిలో చేరారు. అదేవిధంగా జనసేనలో…