
కనీసం వైసీపీ నమ్ముకొన్న సంక్షేమ పధకాల గురించి కూడా ఎవరూ సాధికారికంగా మాట్లాడ(లే)కపోవడం విచిత్రమే. పోనీ జగనన్న మాట కాదనకుండా గడప గడపకి తిరుగుతున్నారా?అంటే అదీ లేదు. టికెట్ ఇవ్వనని అధినేత హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకొంటున్నట్లు కూడా లేదు. ఎందుకంటే తమకు కాక మరెవరికి ఇస్తారనే ధీమా కావచ్చు!
కనుక మాట్లాడే ఆ నలుగురు మంత్రులలో ఒకరైన గుడివాడ అమర్నాథ్ ఈ నాలుగేళ్ళలో తన పరిశ్రమల శాఖ ఏమి సాధించిందో చెప్తారనుకొంటే, అది చాలా క్లిష్టమైన మరియు చాలా హెవీ సబ్జెక్ట్ కనుక ‘ఈజీ టాపిక్’ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి అనర్గళంగా మాట్లాడేశారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “నాక్కూడా పవన్ కళ్యాణ్లాగా ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రి కావాలనే ఉంది. ఆయనలాగా మూడు పెళ్ళిళ్ళు చేసుకొంటే ముఖ్యమంత్రి అవగలనంటే నేను కూడా మూడు, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొనే వాడిని. పవన్ కళ్యాణ్ ఓ సినీ నటుడు కనుక అభిమానులు ఉంటారు. కాపు కులంలో పుట్టారు కనుక ఆ కులంలో వారు జేజేలు పలుకవచ్చు.
అసలైన నాయకుడికి నాయకత్వ లక్షణాలు, పట్టుదల, సహనం, నిబద్దత ఉండాలి. అవేవి ఆయనకు లేవు కనుకనే ఎన్నికలలో గెలవలేకపోతున్నాడు. మూడు పెళ్ళిళ్ళు చేసుకొంటేనో లేదా ఉపవాసాలు చేస్తేనో సరిపోదు. మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని తిట్టినంత మాత్రన్న ఆయన ముఖ్యమంత్రి అయిపోలేడు. కనీసం ప్రత్తిపాడు ఎమ్మెల్యే కూడా కాలేడు. కనుక నిబద్దతతో రాజకీయాలు చేస్తే మంచిది,” అని గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఎదుర్కొలేని పరిస్థితిలో వైసీపీ ఉంది కనుకనే ఈవిదంగా ఆయన వ్యక్తిగత విషయాల గురించి మంత్రి గుడివాడ మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. పనిలో పనిగా తనకు ముఖ్యమంత్రి లేదా కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేశారు.
ఆయన ఎల్లప్పుడూ ఓ వైసీపీ నేతగానే మాట్లాడుతుంటారు తప్ప ఏనాడూ ఏపీ పరిశ్రమలశాఖ మంత్రిగా మాట్లాడింది లేదు. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్లాగా దేశవిదేశాలలో పర్యటించి ఏటా తన రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చుకొంటారు. కానీ అదే శాఖకు మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఒక్క పరిశ్రమ ను సాధించలేకపోయారు. మంత్రి పదవికే న్యాయం చేయలేకపోతున్నప్పుడు ఇంకా ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తుండటం విడ్డూరంగా ఉంది.
ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా బీజేపీ టార్గెట్ గా కాక్రోచ్లు చేస్తున్న రాజకీయానికి ఏపీలో ఎంట్రీ లభిస్తుందా.? సీజేపీ నేతలు…
Nuveksha gives the classic red saree a fresh, playful spin in this striking indoor photoshoot.…