
దుష్టుడు, మూర్ఖుడితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే… అని తెలిసినా కొందరు కొన్ని అవసరాలు లేదా ప్రయోజనాల కోసం చేస్తుంటారు. అలా చేసిన వాళ్ళు కేసులో చిక్కుకొని జైలు పాలవుతుంటారు లేదా ప్రాణాలు కోల్పోతుంటారు.
ఇదే విధంగా కొన్ని దేశాలు కూడా కొన్ని అవసరాల కోసమో లేదా అయిష్టంగానో వేరే దేశాలతో స్నేహంగా ఉండాల్సి వస్తుంది. అవతలి దేశం భారత్‌లా మంచిదైతే ఆఫ్ఘనిస్తాన్‌లా ప్రాజెక్టులు, పార్లమెంటు భవనాలు నిర్మించుకోవచ్చు. కానీ అవతలి దేశం అగ్రరాజ్యమైతే ఏదో రోజూ దుబాయ్, అబుదాబి, సౌదీ వంటి దేశాల్లా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు…. అని నిరూపితమవుతోంది ఆ దేశాల మీద కురుస్తున్న బాంబుల వర్షంతో!
ప్రశాంతత, అభివృద్ధి, పర్యాటక రంగాలకు కేంద్రంగా నిలుస్తున్న దుబాయ్‌తో సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అలాగని ఆ దేశాలతో ఇరాన్‌కి శత్రుత్వం ఉందని కాదు. ఆ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఇరాన్ మీద దాడులు చేస్తున్నందునే!
అమెరికా బలవంతం మీదనో లేదా వేరే అవసరాల కోసమో గల్ఫ్ దేశాలు తమ భూభాగాలలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాయి. అందుకు అవిప్పుడు మూల్యం చెల్లించాయి.
వాటి అదృష్టం కొద్దీ అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కుటుంబంతో సహా మట్టుబెట్టాయి. కనుక తాత్కాలికంగా యుద్ధం ఆగిపోవచ్చు. కానీ ఇరాన్ తప్పకుండా దీనికి ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించింది. కనుక గల్ఫ్ దేశాలపై మళ్ళీ క్షిపణుల వర్షం కురియవచ్చు. ప్రజలు ప్రాణాలు పోవచ్చు.
ఈ యుద్ధంతో సంబంధం లేని గల్ఫ్ దేశాలపై దాడులు జరగడానికి కారణం ఎవరు? గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించడానికి కారణం ఎవరు?అమెరికా.. ఇరానా లేదా తమ భూభాగాలలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించిన గల్ఫ్ దేశాలా?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…