
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేడు ఉండవల్లిలో సిఎం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిలో వారు చెప్పిన కొన్ని విషయాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి.
సిఎం చంద్రబాబు నాయుడు: గతంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలే స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించుకొని నిర్ణయాలు తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసుకునేవారు. కానీ నా 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో తొలిసారిగా ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు, అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ ఎన్నికలలో బీఫారం పొందిన కూటమి అభ్యర్థులను కాదని ఎవరైనా రెబల్ అభ్యర్ధులుగా పోటీకి దిగితే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు.
ఈ ఎన్నికలు జగన్కు ఓ రాజకీయ క్రీడ మాత్రమే. అందుకే రెండు రోజులు ప్రెస్మీట్లు పెట్టి నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతుంటారు. కానీ మేము ఈ ఎన్నికలను గ్రామస్థాయి వరకు పాలన వికేంద్రీకరణ, తద్వారా రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదపడేవిగా చూస్తాము,” అని సిఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్: ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మా పార్టీలో వేలాదిమంది పోటీకి సిద్ధపడటం నాకు చాలా సంతోషం కలిగించింది. 2024 ఎన్నికలలో సీట్ల సర్దుబాట్లపై మూడు పార్టీల మధ్య చాలా సమావేశాలు నిర్వహించుకున్నాము. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తగు నిర్ణయాలు తీసుకున్నాము.
కానీ ఈ ఎన్నికల్లో ఇన్నివేలమంది పోటీ పడటం వలన సీట్ల కేటాయింపు చాలా క్లిష్టంగా మారింది. ఇప్పుడు అవకాశం దక్కకపోయినా రాబోయే రోజుల్లో అందరికీ ఏదోవిధంగా అవకాశాలు కల్పిస్తాను. కనుక అందరూ కూటమి అభ్యర్ధులను 100 స్ట్రైక్ రేటుతో గెలిపించాలి,“ అని విజ్ఞప్తి చేశారు.
సీట్ల సర్దుబాట్ల కారణంగా మూడు పార్టీల ఐఖ్యత దెబ్బ తిందని పుకార్లు పుట్టిస్తున్నవారికీ, లేదా అలా భావిస్తున్న వారికి చెక్ పెట్టేందుకే ఈ సంయుక్త సమావేశం.
ముఖ్యంగా రెబెల్ అభ్యర్ధులను బ్రతిమాలుకునే ప్రసక్తి లేదని, నామినేషన్స్ ఉపసంహరించుకొని కూటమి అభ్యర్ధులకు మద్దతు ఈయకపోతే చర్యలు తప్పవనే బలైన సంకేతం ముగ్గురు నేతలు ఇవ్వడం చాలా మంచి ఆలోచనే.
అలాగే వైసీపీ.. దాని సొంత మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాలకు, ముఖ్యంగా ప్రెస్మీట్లు పెట్టి జగన్ చేస్తున్న ఆరోపణలకు, కూటమి నేతలు పోలింగ్ ముందు ఈ విధంగా సూటిగా, ధీటుగా సమాధానాలు ఇవ్వడం కూడా చాలా అవసరం. లేకుంటే వారు చేస్తున్న వాదనలే నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుంది.
Two distinct character introductions are offering audiences an early look at the world being created…
The Supreme Court’s latest decision on Andhra Pradesh municipal elections has cleared the way for…