
నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (డెమొక్రాట్), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్) ఇద్దరూ ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ పెన్సెల్వేనియాలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కానీ అదృష్టవశాత్తు ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ కాల్పులలో ట్రంప్ చెవికి గాయం అయ్యింది. భద్రతాసిబ్బంది వెంటనే ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి హాస్పిటల్కు తరలించారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఈ ఎన్నికలలో గెలిస్తే మళ్ళీ అధ్యక్షుడు అవుతారు కూడా. అమెరికా అధ్యక్షుడుకి ప్రపంచంలో మరే దేశాధినేతకు లేనంత భద్రత ఉంటుంది. కనుక ఆయనకు అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. ప్రపంచంలోకెల్ల అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఆయన పర్యటనలలో, ఎన్నికల ప్రచార సభలలో భద్రతని పర్యవేక్షిస్తుంటుంది.
అయినా ఓ బహిరంగ సభలో ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరపడం, దానిలో ఆయన గాయపడటం రెండూ చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమే అని చెప్పవచ్చు.
అంతేకాదు… అమెరికాలో తుపాకి సంస్కృతికి ఇది పరాకాష్టగా కూడా చెప్పవచ్చు. తుపాకీ సంస్కృతికి అమెరికాలో ఏటా వందల మంది అమాయక ప్రజలు, విద్యార్దులు, చిన్న పిల్లలు చనిపోతూనే ఉన్నారు.
కానీ తుపాకుల బిజినెస్ వేల కోట్ల టర్నోవర్ జరుగుతుండటంతో అమెరికా పగ్గాలు ఎవరు చేపట్టినప్పటికీ తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దాని బాధితుడయ్యారు.
ఈ కాల్పులలో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, అమెరికా అధ్యక్ష అభ్యర్ధులకే భద్రత లేకపోతే ఇక వారు సామాన్య ప్రజలకు ఏపాటి భద్రత కల్పించగలరు? అని సందేహం కలుగక మానదు. అమెరికాలో తుపాకి సంస్కృతికి ఎవరూ మినహాయింపు కాదని కూడా ఈ ఘటన నిరూపిస్తోంది.
A film's release is no longer the only way for a new heroine to get…
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…