Telugu

రమణ గాడి బీడీ: “హానికరం కాదు ఆయుర్వేదమంటా”..!

తన సినిమాను ప్రమోట్ చేయడానికి ఎప్పుడు ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి కొంచెం లేటయ్యారనే చెప్పాలి. లేట్ గా వచ్చినా తన అభిమానులకు లేటెస్ట్ న్యూస్ ఇచ్చారు ప్రిన్స్ మహేష్ బాబు.

గుంటూరు కారం సినిమా పై ప్రేక్షకులలో మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ మహేష్ తన కటవుట్ తో కలెక్షన్లలో కోత రాకుండా ఆపగలిగారు. మొదటి నుంచి గుంటూరు కారం ప్రమోషన్లలో కాస్త వెనుకపడిందనే చెప్పాలి. సినిమా ప్రీ రిలీజ్ వేడుక మినహాయిస్తే సినిమా పరంగా మరే ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు జరగలేదు.

ADVERTISEMENT

గుంటూరు కారం తో మహేష్ రమణ గాడిగా తన మాస్ అభిమానుల ఆకలి తీర్చారనే చెప్పాలి. గళ్ళలుంగీ, చేతిలో బీడీతో రమణ గాడు థియేటర్లలో కలెక్షన్ల తాట తీస్తున్నాడు అంటూ చిత్ర నిర్మాత నాగ వంశీ, దిల్ రాజు సక్సస్ మీట్లో తమ సినిమా 164 కోట్ల గ్రౌండ్ టోటల్ వసూళ్లు సాధించిందన్నారు. అయితే రమణ గాడి కోసం మొదటిసారిగా హీరోహిన్ శ్రీలీలతో కలిసి మీడియా ముందు కొచ్చిన మహేష్ సినిమాలో తానూ కాల్చిన బీడీ పై ఒక క్లారిటీ ఇచ్చారు.

గుంటూరు కారం సినిమాలో రమణ గాడి క్యారెక్టర్ చేసిన మహేష్ ఎక్కువగా బీడీ తాగుతూ కనిపిస్తాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో మహేష్ మాట్లాడుతూ తానూ సినిమాలో కాల్చిన బీడీ నిజమైన బీడీ కాదని అది ఒక ఆయుర్వేద బీడీ అని క్లారిటీ ఇచ్చారు. మింట్ ఫ్లేవర్, లవంగాలతో చేసిన ఆయుర్వేద బీడీ అది అంటూ అసలు వాస్తవాన్నిబయటపెట్టారు మహేష్. నేను పొగ తాగను, అలాగే ఎప్పుడు దానిని ప్రోత్సహించనని చెప్పుకొచ్చారు. దీనితో మహేష్ అభిమానులు “రమణ గాడి బీడీ హానికరం కాదు ఆయుర్వేదమంటూ” మహేష్ మాటలను వైరల్ చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బొద్దింకలు మాకు థాంక్స్ చెప్పాయి.. అందరూ విన్నారా?

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…

20 minutes ago

Career Setbacks, Social Media Trolls: Cricketer Breaks Silence

Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…

29 minutes ago