Telugu

బొద్దింకలు మాకు థాంక్స్ చెప్పాయి.. అందరూ విన్నారా?

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల ధన్యవాదాలు తెలిపారు.

సంఘీభావం తెలుపడం, ఈ ‘థాంక్స్ గివింగ్’ వార్తని వైసీపీ సొంత మీడియా చెప్పుకోవడం మామూలు వార్తగా అనిపించవచ్చు. కానీ ఎన్నడూ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడని జగన్‌, ఇంత బహిరంగంగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సీజేపీకి సంఘీభావం తెలుపడం మాత్రం మామూలు విషయం కాదు.

ADVERTISEMENT

బిజేపీ-టీడీపిలను 2019 ఎన్నికల నాటికి విజయసాయిరెడ్డి చేత విడగొట్టించారే తప్ప, బిజేపితో పొత్తు పెట్టుకోవాలని అనుకోలేదు. కానీ మోడీ ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా పార్లమెంటులో బయటా వైసీపీ మద్దతు ఇస్తూనే ఉంది.

ఆ తర్వాత 2024 ఎన్నికలలో జగన్‌ బద్ధ శత్రువైన టీడీపితో బీజేపీ పొత్తులు పెట్టుకుంది. రాష్ట్రంలో ఆయన పదవి, అధికారం కోల్పోవడానికి బిజేపి కారణమైంది.

కానీ అప్పుడు కూడా జగన్‌ ఈవీఎంలను, చంద్రబాబు నాయుడుని నిందించారే తప్ప ప్రధాని మోడీని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు? అంటే కారణాలు అందరికీ తెలుసు.

మరిప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సీజేపీకి సంఘీభావం తెలిపారు.. ఎందుకు? సీజేపీ తనకు థాంక్స్ చెప్పిందన్న విషయాన్ని కూడా సొంత పత్రికలో అచ్చేయించుకున్నారు.. ఎందుకు? అంటే దీనికీ కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి.

ఇంతకాలం ఏమి జరగకూడదని ఆయన కోరుకున్నారో సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. జగన్‌, వైసీపీ రాజకీయ భవిష్యత్‌ను దెబ్బతీయగల ‘రెండు పెద్ద కేసుల’ విచారణ వేగవంతం అయ్యింది.

కనుక ఇంకా వేగవంతమైతే తాను కాంగ్రెస్‌ స్నేహహస్తం అందుకొని, ఇండియా కూటమిలో చేరడానికి వెనుకాడనని ఈవిధంగా ప్రధాని మోడీకి జగన్‌ సంకేతాలు పంపుతున్నట్లు భావించవచ్చు.

ప్రధాని మోడీ ఇక ముందు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి పయనించాలనుకుంటే పయనించవచ్చు. కానీ ఈ రెండు కేసుల జోలికి వెళ్ళవద్దని సీబీఐ, ఈడీలకు ఓ ముక్క చెప్తే చాలు.. వైసీపీలోకి బొద్దింకలు చేరకుండా ఆపుతారు. లేకుంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బొద్దింకలు చేస్తున్న తిరుగుబాటులో మరో నీలి బొద్దింక కూడా చేరుతుంది. అంతే!

జగన్‌ చెప్పాల్సింది చెప్పేసినట్లే. కనుక ఇప్పుడు బంతి మోడీ కోర్టులో ఉన్నట్లే లెక్క!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Career Setbacks, Social Media Trolls: Cricketer Breaks Silence

Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…

16 minutes ago

Vijay Made A Huge Mistake, No Doubt!

Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…

46 minutes ago