
న్యూ హ్యాంప్ షైర్ కు చెందిన డైన్ కంపెనీ ఐఎస్పీపై దాడితో హ్యాకింగ్ వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ కు అనుసంధానమైన వెబ్ కామ్ లు, రూటర్లు, సెట్ టాప్ బాక్సులు, డీవీఆర్ ల సాయంతో ఈ దాడి జరగడం గమనార్హం. యూఎస్ తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్, కాలిఫోర్నియాలోని లెవల్ 3 సమాచార వెబ్ సైట్లన్నీ వైరస్ దాడికి గురయినట్టు డౌన్ డిక్టేటర్ డాట్ కామ్ వెల్లడించింది.
అమెరికాతో పాటు యూరప్ లోనూ పలు వెబ్ సైట్లు నిలిచిపోయాయి. వివిధ రకాల చెల్లింపుల నిమిత్తం ప్రయత్నించిన వారు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. హ్యాకర్లు చాలా తెలివిగా దాడులు చేశారని డైన్ అధికార ప్రతినిధి కైలే యార్క్ వెల్లడించారు. ఒకసారి సమస్యను పరిష్కరించగానే, మరోసారి దాడి జరిగిందని వివరించారు. కాగా, హ్యాకింగ్ తీవ్ర స్థాయిలో ఉండటంతో యూఎస్ అంతర్గత భద్రతా విభాగం రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించింది.
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా,…
Telugu cinema witnessed two new theatre films this weekend in the form of Aadarsha Kutumbam(AK-47)…