Telugu

తన గొయ్యిని తానే తవ్వుకున్న హార్ధిక్ పాండ్య!

“ఎదిగిన కొద్దీ ఒదగాలి” అన్నది నానుడి. అలా కాకుండా తల ఎగరేస్తే మాత్రం తల దించుకునే పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న హార్ధిక్ పాండ్య ఇలాంటి పరిమాణాలనే చవిచూస్తున్నారు.

ADVERTISEMENT

గుజరాత్ నుండి ముంబైకి రావాలంటే తనకు ఖచ్చితంగా కెప్టెన్సీ ఇవ్వాలనే నిబంధన హార్థిక్ పాండ్య వ్యవహార తీరుకు అద్దం పట్టింది. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు ట్రోఫీలను అందించడమే కాకుండా, ప్రస్తుతం టీమ్ ఇండియాకు కూడా కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న రోహిత్ శర్మను తప్పించి తనకు కెప్టెన్సీ అప్పగించాలని కోరడం, దానిని ముంబై ఫ్రాంచైజ్ ఒప్పుకోవడంతో ఓ రకంగా ముంబై అభిమానులే అప్పట్లో తిట్ల వర్షం కురిపించారు.

సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో అభిమానులు ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో అవ్వడం కేవలం హార్ధిక్ పాండ్య వలనే! ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైనప్పటికీ, అభిమానులు కించిత్ కూడా బాధపడకపోవడానికి కూడా హార్ధిక్ పాండ్యనే కారణం.

ఇక్కడే ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటించినపుడు ‘సచిన్ బ్యాటింగ్ నైపుణ్యత చూడడం కోసం, సచిన్ బాగా ఆడాలి, కానీ ఇండియా గెలవకూడదు’ అని ఆసీస్ క్రికెట్ ప్రేమికులు కోరుకునేవారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అభిమానుల పరిస్థితి కూడా అలానే ఉంది. ‘రోహిత్ శర్మ బాగా ఆడాలి, ముంబై ఇండియన్స్ మాత్రం విజయం సాధించకూడదు’ అనేటంత విద్వేషం హార్ధిక్ పాండ్యపై వ్యక్తమవుతున్నాయి.

ఆటలో గెలుపు – ఓటములు చాలా సహజం. ఆడిన రెండు జట్లల్లో ఒక్క జట్టే విజయం సాధిస్తుంది. కానీ ఆ గెలుపు కోసం ఇరు జట్లు ఎంతలా కృషి చేసామనదే వీక్షకులకు గుర్తుండి పోతుంది. ముంబై ఇండియన్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్ధిక్ పాండ్యలో లోపించింది కూడా ఇదే. అందుకే ఇంతలా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

హైదరాబాద్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం సోషల్ మీడియాకు హార్ధిక్ పాండ్య ఆహారం అయ్యారు. ప్రముఖ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్ మొదలుకుని సాధారణ మేమ్ క్రియేటర్ వరకు అందరిదీ ఒక్కటే బాట… హార్ధిక్ వ్యవహార తీరే హాట్ టాపిక్ గా ఇంస్టాగ్రామ్, ఎక్స్, ఫేస్ బుక్ లు చెలరేగిపోయాయి.

‘హార్ధిక్ పాండ్య మంచి ఫినిషర్, ఖచ్చితంగా ఏదొక రోజు ముంబై ఇండియన్స్ ను ఫినిష్ చేసేస్తాడు’ అనే ఫన్నీ మేమ్స్ మొదలుకుని, 12 ఓవర్ల వరకు బూమ్రా చేత ఒకే ఒక్క ఓవర్ వేయించిన కెప్టెన్సీ వరకు హార్దిక్ వ్యవహార తీరును చీల్చి చెండాడారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బౌలింగ్ లో హార్ధిక్ తీసిన రెండు వికెట్ల వెనుక కూడా ఓ ట్రిక్ ఉందంటూ చెప్పుకొచ్చారు.

బూమ్రా ఓవర్ పూర్తి కాగానే మరుసటి ఓవర్ ను హార్ధిక్ పాండ్య వేయడం హైదరాబాద్ మ్యాచ్ లో రెండు సార్లు జరిగింది. హార్ధిక్ ఖాతాలో చేరిన రెండు వికెట్లు కూడా ఆ ఓవర్లో రావడం గమనార్హం. అంటే బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడం హార్ధిక్ కు కలిసి వచ్చినట్లయ్యింది. ఇలా ఒకటేమిటి… సోషల్ మీడియా అంతటా హార్ధిక్ నామ విమర్శలే!

ఇది హైదరాబాద్ మ్యాచ్ కే పరిమితం కాలేదు. తొలుత గుజరాత్ తో జరిగిన మ్యాచ్ ఇందుకు మినహాయింపు కాదు. అతి విశ్వాసంతో వ్యవహరిస్తోన్న హార్ధిక్ పాండ్య ఓ విధంగా తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నారు. అయితే దానిని గమనించుకోలేక, పొరపాటు మీద పొరపాట్లు చేసుకుంటూ పోతున్నారు.

ప్రపంచమంతా ‘క్రికెట్ గాడ్’గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ వలనే ముంబై ఇండియన్స్ కు ప్రాంతీయ బేధాలు లేకుండా అభిమానులు ఉన్నారు. ఆ ఒరవడిని రోహిత్ శర్మ ఘనంగా కొనసాగించడమే కాకుండా, ఏకంగా ముంబైకి 5 ట్రోఫీలను కూడా అందించారు. అంత సాధించిన సచిన్, రోహిత్ ల వ్యవహార శైలి ఏనాడూ విమర్శలకు దారి తీసింది లేదు. ఇంకా చెప్పాలంటే పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచారే తప్ప, పది మంది చేత తిట్టించుకున్నది లేదు.

ఆ మాటకొస్తే, ఐపీఎల్ లో ప్రస్తుతం 10 జట్లు ఉండగా, కేవలం ఒకే ఒక్క హార్ధిక్ పాండ్య తీరు మాత్రమే విమర్శలకు తావిస్తోంది. కాలక్రమంలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాల్సిన హార్ధిక్ పాండ్యకు ఇది ఏ మాత్రం సమంజసం కాదు. సరిచేసుకుని అందరిని కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా హార్ధిక్ పైన చాలా ఉంది. లేదంటే “నడమంత్రపు సిరి”గానే మిగిలిపోవాల్సి ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47 Confusion Turns Double Trouble for Venkatesh?

Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…

5 hours ago

H-4 EAD Update: USCIS Removes Automatic Extension

The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…

5 hours ago