Telugu

పిల్లలలో ఉన్మాదం…ఎవరిదీ పాపం..?

మానవసంబంధాల బలహీనత సమాజాన్ని ఎటువైపుకి తీసుకెళుతుంది అనేదానికి నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు సజీవ సాక్ష్యాలుగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. జీవిత అనుభవాలు అన్ని చూసిన కొంతమంది పెద్దల నుంచి ఉడుకు రక్తం తో ఉండే కొందరు యువత వరకు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్న ఘటనలు సమాజంలో పెరుగుతున్న ఉన్మాదానికి నిదర్శంగా చూడాలి.

అయితే తాజాగా హరియాణా పాఠశాలలో ఇద్దరి చిన్నారుల మధ్య జరిగిన అమానవీయ ఘటన పిల్లలలో కూడా ఇంత ఉన్మాదమా.? అన్న ప్రశ్న లేవనెత్తింది. హరియాణా లోని పంచకులలోని మూడో తరగతి చదువుతున్న ఒక బాలుడు అదే స్కూల్ లో కిండర్ గార్డెన్ చదువుతున్న బాలిక పై విచక్షణారహితంగా దాడి చేసాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ADVERTISEMENT

8 ఏళ్ళ బాలుడు 6 ఏళ్ళ బాలిక మీద చేసిన ఈ దాడి చూస్తున వారి కళ్ళలో భయాన్ని పుట్టిస్తుంది. ఒక చిన్న పిల్లాడు ఇంత ఉన్మాదంగా మరో చిన్న పిల్ల మీద ఎందుకింత దారుణంగా ప్రవర్తించాడు.? అసలు ఆ బాలుడి మానసిక పరిస్థితి ఏమిటి.? ఆ బాలుడు తల్లితండ్రుల పెంపకం ఎలా ఉంది.?

అసలు ఆ బాలుడు ఆ బాలికను అంత దారుణంగా చితకబడుతుంటే ఆ స్కూల్ సిబ్బంది ఎక్కడున్నారు.? అంటూ ఇలా అనేక ప్రశ్నలు ఆ వీడియో చూస్తున్న వారి మెదడును తొలిచేస్తున్నాయి. బాలికను కిందపడేసి కాళ్ళేసి తొక్కుతూ, ఆ పాప తలను క్లాస్ రూమ్ బెంచ్ కేసి కొడుతూ ఎదో సినిమాలో హీరో, విలన్ ఫైటింగ్ సీన్స్ మాదిరి చెప్పాలంటే అంతకు మించి చేసాడు ఆ బాలుడు.

అసలు ఇంత పసి వయస్సులోనే ఆ పిల్లడు ఇంత ఉన్మాదిగా ప్రవర్తించాడు అంటే ఇక రేపటి రోజున ఇటువంటి వారు పెరిగి పెద్దైతే సమాజం ఎటువైపుకి వెళుతుంది.? నేడు ఏపీలోని రాప్తాడు లో బాలిక మీద రంపం మిషన్ తో దాడి చేసిన ఘటన దిగ్భ్రాంతిని కలిగిస్తే హరియాణలో లో జరిగిన ఈ దాడి భవిష్యత్ సమాజం మీద భయాన్ని పుట్టిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

స్థానిక ఎన్నికలు: మావిగన్ లో వైసీపీ జెండా ఎగరేస్తుందా.?

రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ పార్టీకి ఒక స్పష్టత లేదని, ప్రతి ఎన్నికలకొకసారి రాజధాని పేరును మారుస్తూ వైసీపీ రాజధాని…

22 minutes ago

Aadarsha Kutumbam Lands in Unexpected Controversy

Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam is facing an unexpected controversy amid its box-office run. The…

27 minutes ago