
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల వైద్య సేవలను మరింత మెరుగు పరిచే దిశగా హెల్త్ కేర్ ఏటీఎంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరనున్నాయి. మొత్తం 25 హెల్త్ కేర్ ఏటీఎంలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో ఒకటి, మిగిలిన అన్ని జిల్లాల్లో రెండు చొప్పున వీటిని సత్వరమే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏటీఎం సెంటర్లలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన తలనొప్పి, మధుమేహం, జ్వరం వంటి రోగాలకు ఔషధాలు ఒక్క క్లిక్ తో లభిస్తాయి. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని మార్చిలోనే కేంద్రం నిర్ణయించింది. వీటి ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వాలన్నది మోడీ సర్కారు నిర్ణయం. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా వీటిల్లో ఔషధాలను నింపుతారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి అయినట్లయితే, ఈ ఏటీఎం మెషీన్ ద్వారానే సమీపంలోని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చేందుకు కూడా వీలు కలిగేలా ఏర్పాటు చేసారు.
For the first time in a long time, there is genuine curiosity about whether Prabhas…
Goodachari 2 is one of those Telugu films that has built strong expectations without relying…