ఇక్కడ ‘కుల’ రాజకీయాలు…అక్కడ ‘మత’ రాజకీయాలు…!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచార వేడి హద్దులు దాటుతుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ‘కులాల’ చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణ రాజకీయాలు ‘మతాల’ మాటున చిక్కుకుంటున్నాయి.

ఏపీ లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ కాపుల ఓట్లను గంపగుత్తగా పవన్ చంద్రబాబు కు, ఆయన సామజిక వర్గానికి తాకట్టు పెడుతున్నారని, కాపు ఓటర్లు పవన్ మాయలో పడకుండా వైసీపీకే ఓటేయాలంటూ కుల రాజకీయాలు మొదలు పెట్టారు.

ADVERTISEMENT

ఈ కుల రాజకీయాలను కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ పైకి ఆయన సామజిక వర్గానికి చెందిన నేతలనే అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. అందులో ముఖ్యంగా కులపెద్దగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ను ముందువరుసలో పెట్టి కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ పెద్దాయనకు వైసీపీ లో కాపు నాయకులు అంబటి, పేర్నినాని, గుడివాడ అమర్నాధ్ వంటి వారు ఓంత పాడుతున్నారు.

ఏపీలో ఇలా కుల రాజకీయాలు నడుపుతూ తమ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మత రాజకీయాల ప్రభావం నానాటికి పెరిగిపోతున్నది. తెలంగాణలో బీజేపీ కాస్త బలపడడంతో హిందూ- ముస్లిం అంటూ మత రాజకీయాలు మొదలయ్యాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ ని టార్గెట్ చేస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చేస్తారు అంటూ ప్రచారం మొదలుపెట్టింది.

బిఆర్ఎస్, బీజేపీకి ‘బి’ టీంగా పనిచేస్తుందని కాంగ్రెస్, కాంగ్రెస్ కి బీజేపీ ‘బి’ టీం గా పనిచేస్తుందని బిఆర్ఎస్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు ఒక్కటేనని తెలంగాణకు దొంగ పోయి గజ దొంగ వచ్చాడని బీజేపీ ఇలా ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చకొట్టి బీజేపీ ఓట్లు దక్కించుకోవాలని ఆశపడుతుందని తెలంగాణ ప్రజలు బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో చేసిన అభివృద్ధి పనులు – చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పి ప్రజలను ఓట్లు అడగాల్సిన అధికార – ప్రతిపక్ష పార్టీలు ఇలా కులాల చుట్టూ మతాల చుట్టూ రాజకీయాలు నడుపుతూ ప్రజలకు చేస్తున్న మేలేమిటో సమాధానం చెప్పగలరా..? తరాలు మారుతున్న ప్రజలు తలరాతలు మరకపోవడానికి బాధ్యత ఈ రాజకీయ పార్టీలు కాదా..?

ప్రజల అమాయకత్వాలను, బలహీనతలను తమ పెట్టుబడులుగా పెట్టుకుని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసినంత కాలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశం కూడా అభివృద్ధి అనే పదాన్ని రాజకీయ నాయకుల మాటల్లో, వారి బతుకుల్లో తప్పితే ప్రజల జీవితాలలో కనిపించదు అనేది కాదనలేని వాస్తవం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas Postponement Curse: Will Fauzi & Spirit Break It?

Prabhas and postponements have an interesting history. On several occasions, his films moved away from…

7 minutes ago

Romance Failed, Will Horror Save Kriti Sanon from Flops?

Kriti Sanon is ready to enter uncharted territory with her next big screen outing. The…

28 minutes ago