
అయితే ఓవర్సీస్ లో అంతగా మార్కెట్ లేనటువంటి అల్లు అర్జున్ సినిమానే కాదు, భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాను కూడా ఓవర్సీస్ ప్రేక్షకులు వెనక్కి పంపించారు. ‘కంటెంట్’ లేనటువంటి కధలను ఓవర్సీస్ ప్రేక్షకులు ఏ మాత్రం ఉపేక్షించడం లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది. మార్కెట్ ఉన్న మహేష్ కైనా, లేనటువంటి బన్నీ అయినా… ప్రేక్షకులకు ఒక్కటే అన్న విషయాన్ని బాగా గట్టిగా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ కూడా ఓవర్సీస్ లో ‘బాంబు’ పేల్చిన సినిమాల జాబితాలో ఉన్న విషయం తెలిసిందే.
తాజా పరిణామాలతో ఓవర్సీస్ రైట్స్ విషయంలో పంపిణీదారులు పునరాలోచనలు చేసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాను దాదాపుగా 13 కోట్లకు కొనుగోలు చేసారని వార్తలు రాగా, ఇప్పటివరకు 1 మిలియన్ అంటే సగం వసూళ్ళు మాత్రమే సాధించింది. ఇక, ఈ సినిమా క్లోజింగ్ పూర్తయినట్లే. అంటే సగానికి పైగా తీవ్ర నష్టం వాటిల్లినట్లేనని చెప్పవచ్చు. అలాగే ‘సరైనోడు’ సినిమాకు పెట్టిన 6 కోట్ల పెట్టుబడిలో సగం కూడా వసూలు కాలేదని సమాచారం. ‘సర్ధార్’ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.
తెలుగు సినిమా మార్కెట్ కు నైజాం ఎంత ప్రాముఖ్యమో, ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్ కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్సీ రేట్లను ఆఫర్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారు. అయితే స్థాయిని మించిన పెట్టుబడి ఎప్పటికైనా నష్టాలనే చవిచూస్తుందని ఈ “సమ్మర్” చెప్పకనే చెప్పింది. ఒక సినిమా భారీ హిట్ కొడితే వచ్చే మొత్తంతో ధియేటర్ హక్కులు కొనుగోలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని సినీ పండితులు చెప్తున్న మాటలు.
Goodachari 2 is one of those Telugu films that has built strong expectations without relying…
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…