
The hero reportedly takes charge of one shooting unit as production accelerates across three locations to complete the film on time.
సినిమా అనౌన్స్ చేసినప్పుడు కానీ, మొదలైనప్పుడు కానీ ఆ ప్రాజెక్ట్ మీద ఉన్న హైప్ వేరు. అసలు మాములు సినిమా కాదురా బాబు అనుకున్నారు అందరూ. ఇక గ్లింప్స్ రిలీజ్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంత బోల్డ్ గా ఎలా అని విపరీతమైన చర్చలు మొదలయ్యాయి.
ఇంత హడావుడి నడుమ సినిమా రిలీజ్ అయితే మామూలు హిట్ అవ్వదు అని అభిప్రాయాలు కూడా వెల్లువెత్తాయి. కట్ చేస్తే.. ఒకటికి రెండుసార్లు సినిమా పోస్ట్ పోన్ అవ్వడం, అసలు ఇదే ఫైనల్ డేట్ అంటూ ప్రకటించిన డేట్ కి కూడా సినిమా రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ లేకపోవడంతో జనాల్లో మెల్లమెల్లగా ఆసక్తి తగ్గిపోతూ వస్తోంది.
ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న హీరో రంగంలోకి దిగి ఒక యూనిట్ తో షూట్ చేస్తే సినిమా కంప్లీట్ అవ్వదు అని చెప్పి.. ఏకంగా మూడు యూనిట్లు రంగంలోకి దించాడు. ఇప్పుడు మూడు యూనిట్లు ఒకేసారి మూడు వేర్వేరు లొకేషన్స్ లో షూట్ చేస్తున్నాయి.
సాధారణంగా అయితే.. ఒక యూనిట్ కి దర్శకుడు లీడ్ చేస్తే, మిగతా రెండు యూనిట్స్ సీనియర్ కో డైరెక్టర్స్ లేదా అసోసియేట్ డైరెక్టర్స్ లీడ్ చేస్తారు. కానీ.. ఈ సినిమా విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని హీరో ఒక యూనిట్ కి తానే డైరెక్షన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇదేదో కావాలని కాళ్ళు-వేళ్లు పెట్టడం కాదు, తప్పక తప్పనిసరి పరిస్థితుల్లో సదరు హీరో కాస్త గట్టిగానే ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మరి ఇంత రిస్క్ చేస్తున్న తర్వాతైనా సినిమా అనుకున్న తేదీకి వస్తుందా? లేక మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వలేదంటూ వాయిదా వేస్తారా? అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…